ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

హిజ్బుల్ ఉగ్రవాదులకు పాక్ రసాయన ఆయుధాలు !

Posted 4 months ago world

జమ్ముకశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు, ఎక్కువ సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలిగొనేందుకు కుట్ర చేస్తున్న పాకిస్థాన్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు రసాయన ఆయుధాలను అందజేసిందనే అనుమానాన్ని భద్రతాదళాలు వ్యక్తం చేస్తున్నాయి. భద్రతాదళాలకు లభించిన పలు ఆడియోలు దీనిని బలపరుస్తున్నాయి. ఉగ్రమూకలకు పాకిస్థాన్ ఎలా సహకరిస్తున్నదనే దానికి ఈ ఆడియోలే ప్రబల తార్కాణమని భద్రతాదళాలు పేర్కొంటున్నాయి. 

ఎన్‌కౌంటర్లలో గతకొద్ది నెలలుగా 90 మంది సభ్యులను కోల్పోయిన హిజ్బుల్ ఉగ్రసంస్థ భారత సైన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ భయంకరమైన మార్గాన్ని ఎంచుకున్నదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా బృందాలకు లభించిన ఆధారాల ప్రకారం ఇప్పటికే రసాయన ఆయుధాలు హిజ్బుల్ చేతికి అందాయని సమాచారం.

ఇప్పటివరకు సంప్రదాయ ఆయుధాలు వాడిన ఉగ్రవాదులు తమను కోలుకోలేని దెబ్బ కొట్టిన భద్రతా బలగాలపై రసాయన ఆయుధాలతో మెరుపుదాడులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.  "సరిహద్దు వెంట చేపడుతున్న కార్యకలాపాలకు సంబంధించి మేము పాకిస్థాన్ నుంచి భారీ మద్దతును పొందబోతున్నాం. కొద్దిరోజుల్లో పాకిస్థాన్ యాంటీ ఇండియా గేమ్‌ను ప్రారంభించనున్నది" అని ఓ ఉగ్రవాది మాట్లాడటం ఆడియో టేపుల్లో వినిపించింది. 

అదే ఉగ్రవాది మరో సందర్భంలో మాట్లాడుతూ "ఇప్పటివరకు మేం గ్రనేడ్ లాంచర్లను ఉపయోగించాం. దీనివల్ల ముగ్గురు లేదా నలుగురు మాత్రమే చనిపోయేవారు. కానీ ఇప్పుడు వ్యూహాలను మార్చే సమయం వచ్చింది. ఎక్కువమందిని హతమార్చేందుకు నేరుగా రసాయన ఆయుధాలను ఉపయోగిస్తాం" అని చెప్పాడు.

 200 మంది క్రియాశీల సభ్యులు కలిగిన హిజ్బుల్ ముజాహిద్దీన్ కశ్మీర్ లోయలో అతిపెద్ద ఉగ్రవాద సంస్థగా కొనసాగుతున్నది. అమర్‌నాథ్ యాత్రికులపై దాడి ఈ సంస్థ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దీనికి కారణమని పోలీసులు భావించినా ఆ దాడికి తమకు సంబంధలేదని లష్కరే తోయిబా ప్రకటించింది.

Most Read