//single page style gallary page

అన్నాడీఎంకే వర్గాల విలీనానికి ఓపీఎస్‌ తిరకాసు

Posted a year ago | Category : politics

ఒకటి, రెండు వారాలలో అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం పక్రియను పూర్తి కావించి, ఆగష్టు మధ్యలో జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఆ పార్టీకి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని బిజెపి ఎత్తుగడ వేసింది. ఆ విధంగా తమిళనాడు లో అధికార పార్టీని ఎన్డీయే లో భాగస్వామిగా చేసుకొని తమ బలం పెంచుకోవాలని ఆత్రుత చెందుతున్నది.

పార్లమెంట్ ఉభయ సభలలో ఆ పార్టీకి 50 మందికి పైగా సభ్యులు ఉన్నారు. కనీసం ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది. అయితే విలీన పక్రియకే అడ్డంకులు ఎదురవుతున్నాయి. శశికళ మేనల్లుడు దినకరన్ ఆగష్టు 5న పార్టీ ప్రధాన కార్యాలయంలోకి వచ్చి బాధ్యతలు చేబడుతున్నట్లు ప్రకటించడంతో రెండు వర్గాలు అసహనానికి గురవుతున్నాయి.

మరోవంక మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శిని చేస్తేనే విలీనానికి అంగీకరిస్తామని ఆయన వర్గం స్పష్టం చేస్తున్నది."పన్నీర్‌ సెల్వాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శిని చేస్తేనే విలీనం. పార్టీ శ్రేణులంతా మా వైపే ఉన్నాయి" అని ఓపీఎస్‌ వర్గానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పాండ్యరాజన్‌ స్పష్టంచేశారు. ప్రజల్లోనూ, అటు పార్టీలోనూ తమ బలాన్ని నిరూపించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇందుకోసం స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

పార్టీలో శాసన సభ్యులు, యంపీలు అత్యధికంగా ముఖ్యమంత్రి పళనిస్వామి వైపే ఉన్నా పార్టీ  కార్యకర్తలు,ప్రజలలో పన్నీరుసెల్వం పట్ల సానుభూతి ఉన్న సంగతి బిజెపి కి తెలుసు. ఈ సమస్యను యెట్లా పరిష్కరించాలో తెలియక తికమక  పడుతున్నారు.


గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 6 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 11 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 12 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 18 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 3 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 4 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 7 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

బీజేపీతో భేటీపై ట్విస్ట్..... టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్

Posted 10 hours ago | Category : politics

బీజేపీతో భేటీపై ట్విస్ట్..... టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్

రాహుల్ గాంధీ కి ప్రధాని మోడీ, మమతా బెనర్జీ శుభాకాంక్షలు

Posted a day ago | Category : politics

రాహుల్ గాంధీ కి  ప్రధాని మోడీ, మమతా బెనర్జీ శుభాకాంక్షలు