ఇవియం లపై సవాల్ చేసి తోక ముడిచిన వివక్షలు

Posted 9 months ago | Category : national politics

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఆరోపణలు గుప్పించిన విపక్షాలు, యంత్రాలను ట్యాంపర్ చేసి చూపించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సవాల్‌కు చివరిక్షణంలో ప్రతిపక్షాలు తోకముడిచాయి. కేంద్ర ఎన్నికల సంఘం దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హ్యాకథాన్‌కు కేవలం సిపిఎం, ఎన్సీపీ హాజరైనా, ట్యాంపర్ సవాల్‌కు నిరాకరించి ఓటమిని పరోక్షంగా అంగీకరించాయి. 

కేంద్ర ఎన్నికల సంఘం హ్యాకథాన్‌కు 8 జాతీయ, 48 ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించటం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్, పంజాబ్ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవిఎంల ట్యాంపరింగ్ జరిగిందని పెద్దఎత్తున ఆరోపించిన బిఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు హ్యాకథాన్‌కు గైర్హాజరయ్యాయి. ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, బిఎస్పీ అధినేత్రి మాయావతి ఈవిఎంలు ట్యాంపరయ్యాయంటూ పెద్దఎత్తున దుమారం సృష్టించటం తెలిసిందే. 

ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న సిఇసి, శనివారం హ్యాకథాన్ నిర్వహించింది. అయితే, హ్యాకథాన్‌కు హాజరైన సిపిఎం, ఎన్సీపీల ప్రతినిధులు తాము సవాల్‌కు రాలేదని, ఈవిఎంల పనితీరు అర్థం చేసుకోవడానికే వచ్చామంటూ మాటమార్చారు. 

సిపిఎం, ఎన్సీపీ ప్రతినిధుల విజ్ఞప్తిమేరకు కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతిక సిబ్బంది, నిపుణులు రెండు పార్టీల ప్రతినిధులకు ఈవిఎంల పనితీరును లోతుగా వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతిక సిబ్బంది ఇచ్చిన ప్రదర్శన తమకు సంతృప్తి కలిగించిందని రెండు పార్టీల ప్రతినిధులు తెలిపారు. 

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

ఇక చీరలు కనపడవు !

Posted 6 hours ago | Category : national

ఇక చీరలు కనపడవు !

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted a day ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics