//single page style gallary page

బీజేపీ పై పోరుకు ప్రతిపక్షాలు సై .. సెప్టెంబర్ 1న కాంగ్రెస్ సత్యాగ్రహం

Posted 10 months ago | Category : politics

బీజేపీ వ్యతిరేక కూటమిలో కీలక పాత్రధారిగా భావిస్తూ వస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అకస్మాత్తుగా బంధాన్ని తెంచుకొని, బీజేపీ తో చేతులు కలపడంతో షాక్ కు గురైన ప్రతిపక్షాలు తిరిగి బలం పుంజుకొని ప్రయత్నం చేస్తున్నాయి. 

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ ను రాజ్యసభ ఎన్నికల్లో ఓడించడం కోసం స్వయంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మకాం వేసి వేసిన ఎత్తుగడను తిప్పి కొట్టడం కొంత హుషారు కలిగిస్తున్నది. 

పార్లమెంట్ సమావేశాలు పూర్తి కాగానే సోనియా గాంధీ అధ్యక్షతన 16 ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కలసి సమాలోచనలు జరిపారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు గురించి చర్చించారు. ముందుగా బీజేపీ వ్యతిరేక సదస్సులు దేశ వ్యాప్తంగా జరపడం ద్వారా బలం పుంజుకోవాలని ముందుగా నిర్ణయించారు. 

ఈ నెల 27న పాట్నాలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నిర్వహిస్తున్న బీజేపీ వ్యతిరేక ర్యాలీకి పెద్ద ఎత్తున జనసమీకరణకై ప్రయత్నం చేస్తున్నారు. ఆ తరువాత కాంగ్రెస్   సైతం సెప్టెంబర్‌ 1న గుజరాత్‌లో సత్యాగ్రహ ర్యాలీని చేపట్టేందుకు సిద్ధమైంది. 

గిరిజనులపై దాడులను నిరసిస్తూ చేపట్టనున్న ఈ ర్యాలీ కోసం ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోఈ ర్యాలీ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోంది. ఈ నిరసనకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వం వహించనున్నారని సమాచారం.

ఈ మహా నిరసనలో పాల్గొనాల్సిందిగా అన్నీ ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించామని కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. ఈ నిరసనతో తమ సత్తా చాటాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ప్రస్తుతానికి విపక్ష పార్టీలు ఈ నిరసనకు మద్దతు తెలుపుతాయా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.


ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Posted 10 minutes ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 17 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 23 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 28 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 29 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 35 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 4 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 5 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 8 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!