రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాలు దేవెగౌడ వైపు మొగ్గు !

Posted 9 months ago | Category : national politics

రాష్ట్రపతి పదవికి ఐక్య ప్రతిపక్ష అభ్యర్ధిగా మాజీ ప్రధాన మంత్రి, జెడిఎస్‌ జాతీయ అధ్యక్షులు దేవేగౌడని పోటీ చేయించాలని ప్రతిపక్షాలు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఆయన అందుకు అంతగా సుముఖంగా లేరని తెలుస్తున్నది. ఈ విషయమై పలువురు నాయకులు ఆయనపై వత్తిడి తెస్తున్నారు. 

కాంగెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా ఫోన్ చేసి ఆయనను పోటీ చేయమని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టదలుచుకున్నట్లు ఆయన చెప్పారు. అయినా జాతీయ స్థాయిలో ఉన్న దేవేగౌడ రాజకీయ స్నేహితులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. ఎన్‌సిపి అధ్యక్షులు శరద్‌ పవార్‌, జెడి(యు) నేత శరద్‌ యాదవ్‌, డిఎంకె అధ్యక్షులు కరుణానిధి తదితరులు దేవేగౌడకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సోనియా గాంధీ మరో అడుగుముందుకేసి మరింత సమయం తీసుకుని తగిన నిర్ణయంతో రావాలని సూచించారు. దీంతో దేవేగౌడ డైలమాలో పడ్డారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమంటే దేవేగౌడకు రాజకీయ శత్రువులైన ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, విద్యుత్‌ శాఖ మంత్రి డి.కె. శివకుమార్‌లు కూడా ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. 

దేవెగౌడ అభ్యర్థిత్వం ముందు రావడంతో కర్ణాటకలోని బిజెపి నాయకులు ప్రత్యేకించి వొక్కలింగ కమ్యూనిటికి చెందిన నేతలు ఇరకాటంలో పడిన్నట్లు తెలుస్తున్నది. వొక్కలింగలకు ఉన్న ఒకేఒక్క అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకులు దేవేగౌడ కావడంతో ఆయనకు మద్దతివ్వడాన్ని నిరాకరించలేని పరిస్థితిలో రాష్ట్ర బిజెపి నాయకులున్నారు. వచ్చే సంవత్సరం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగ బోవటమే అందుకు కారణం. 


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 7 hours ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 8 hours ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 16 hours ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted a day ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted a day ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!