//single page style gallary page

బీజేపీ ఏజెంట్ గా తమిళనాడు గవర్నర్ ... ప్రతిపక్షాల మండిపాటు

Posted 9 months ago | Category : politics

మైనారిటీలో పడిన ముఖ్యమంత్రి ఇదప్పడి పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోకుండా ఇన్ ఛార్జ్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు బీజేపీ నాయకత్వం ఆదేశాల మేరకు పాడౌతున్నారని, రాజ్యంబద్ధమైన విధులను నిర్వహించాహదం లేదని తమిళనాడులో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

19 మంది అధికార అన్నాడియంకె ఎమ్మెల్యేలు కలసి, ప్రభుత్వంపై తాము విశ్వాసం కోల్పోయామని తెలిపి పదిరోజులైనా ఇంకా అధికారికంగా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా డాటా వేస్తూ వస్తున్నారు. గవర్నర్ వైఖరితో అసహనం వ్యక్తం చేస్తున్న తిరుగుబాటు ఎమ్యెల్యేలతో పాటు డీయంకే ఇతర ప్రతిపక్ష శాసన సభ్యులు కూడా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ని కలసి గవర్నర్ బీజేపీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదు చేయడం కోసం సిద్దపడుతున్నారు.

అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలన్న డిమాండ్ పై నేరుగా స్పందించా కూడా,  బుధవారం తనను కలసిన కొందరు ప్రతిపక్ష నాయకులతో మాత్రం వారింకా అధికారపక్షం పక్షం లోనే  ఉన్నారని, కాబట్టి పార్టీ అంతర్గత  అంశం  అవుతుందని, తాను అందులో జోక్యం చేసుకోలేనని తేల్చి చెప్పారు. దాంతో ఇప్పటికిప్పుడు పళనిస్వామి సర్కార్‌కు వచ్చే ప్రమాదం ఏమీ లేదని గవర్నర్ సంకేతాలిచ్చినట్లయింది.

తమిళనాడు గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. "తమిళనాడు తలెత్తిన రాజకీయ సంక్షోభం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని మొదటి నుంచి చెబుతున్నాము" అని ఆయన  గుర్తు చేసారు. ఉపముఖ్యమంత్రి పన్నీరుసెల్వం ప్రమాణ స్వీకారం సందర్భంగా పళనిస్వామి, పన్నీరుసెల్వం చేతులు కలుపుతూ వారిద్దరి మామధ్య తానే రాజీ కుదిర్చిన్నట్లు విద్యాసాగరరావు ఫోటోలకు పోజులివ్వడం సహితం ప్రతిపక్షాలకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నది.

రాష్ట్రపతి, న్యాయనిపుణులు  కేంద్ర హోమ్ మంత్రి రాజనాధ్ సింగ్ సలహా ప్రకారం నడుచుకొంటున్నట్లు తనను కలసినవారికి గవర్నర్ చెబుతూనే ఉన్నారు. విపక్ష పార్టీలతో పాటు స్టాలిన్  గవర్నర్‌ను  మరోమారు కలసి సీఎం పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు అనుమతించాలని గవర్నర్‌ ను డిమాండ్ చేసారు.

కాగా,  భాగస్వామ్య పార్టీలతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నట్టు స్టాలిన్ చెప్పారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత కూడా తమిళనాడు ప్రభుత్వంపై  చర్య తీసుకోనని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. దానితో ఇప్పటివరకు రాజ్‌భవన్‌ చుట్టూ తిరిగిన తమిళ రాజకీయం ఇప్పుడు హస్తిన చేరనుంది.

మరోవైపు సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌ సెల్వం తమపై తప్పుడు ప్రచారం చేసేందుకేకేంద్ర మంత్రులను కలుస్తున్నారని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ ఆరోపించారు. పళనిస్వామికి  మద్దతు ఇస్తున్నవారిలో  సహితం తన ఏజెంట్లు ఉన్నారని అంటూ వారు  తగు సమయంలో బైట పడగలరని చెప్పారు. వారం రోజుల్లోగా తన వర్గం ఎమ్మెల్యేల 40కి పెరుగుతుందని ధీమావ్యక్తం చేశారు.

పాండిచ్చేరి రిసార్టులో ఉన్న దినకరన్‌ ఎమ్మెల్యేలు  నేడు  చెన్నై చేరుకోనున్నారు. శుక్రవారం  వారితో కలిసి ఢిల్లి వెళ్లడానికి దినకరన్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రపతితో సమావేశం కావాలని దినకరన్‌ యోచిస్తున్నారు.


ఎమ్మెల్యేగా పోటి చెయ్యనని చెప్పిన ఎంపి

Posted 2 hours ago | Category : state politics

ఎమ్మెల్యేగా పోటి చెయ్యనని చెప్పిన ఎంపి

చంద్రబాబుపై అమిత్ షా కామెంట్స్

Posted 2 hours ago | Category : state politics

చంద్రబాబుపై అమిత్ షా కామెంట్స్

చంద్రబాబుని మెప్పించిన కీర్తి సురేష్

Posted 2 hours ago | Category : movies politics

చంద్రబాబుని మెప్పించిన కీర్తి సురేష్

ఆంధ్రప్రదేశ్ కి మరో అంతర్జాతీయ సంస్థ

Posted 2 hours ago | Category : state politics

ఆంధ్రప్రదేశ్ కి మరో అంతర్జాతీయ సంస్థ

మహానాడులో కార్యకర్తల కోసం...ఫుడ్ మెనూ

Posted 2 hours ago | Category : state politics

మహానాడులో కార్యకర్తల కోసం...ఫుడ్ మెనూ

పవన్ దీనికి సమాధానం చెప్తావా..?

Posted 2 hours ago | Category : state politics

పవన్ దీనికి సమాధానం చెప్తావా..?

సీఎం చంద్ర‌బాబుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్‌..!!

Posted 6 hours ago | Category : politics

సీఎం చంద్ర‌బాబుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్‌..!!

జ‌గ‌న్ నీకు తెలుసోలేదో.. నీ పేరు దేశం దాటింది.. టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచ‌ల‌నం..!

Posted 8 hours ago | Category : politics

జ‌గ‌న్ నీకు తెలుసోలేదో.. నీ పేరు దేశం దాటింది.. టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచ‌ల‌నం..!

2019 ఎన్నిక‌ల తాజా స‌ర్వేలో.. దిమ్మ తిరిగే రిజ‌ల్ట్‌..!!

Posted 8 hours ago | Category : politics

 2019 ఎన్నిక‌ల తాజా స‌ర్వేలో.. దిమ్మ తిరిగే రిజ‌ల్ట్‌..!!

అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

Posted a day ago | Category : national politics

అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!

Posted a day ago | Category : politics

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!