నితీష్‌, సుశీల్‌ మోడీ రాజీనామాకు ప్రతిపక్షం డిమాండ్‌

Posted 6 months ago | Category : politics

బీహార్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన భాగల్పూర్‌ ఎన్‌జిఓ కుంభకోణం వరుసగా రెండో రోజు రాష్ట్ర చట్టసభలను కుదిపేసింది. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌, ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోడీ తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రతిపక్షం చేసిన నినాదాలతో ఉభయసభలూ దద్దరిల్లాయి.  అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన వెంటనే ఈ కుంభకోణాన్ని ప్రస్తావించిన ప్రతిపక్ష నేత తేజస్వియాదవ్‌ దీనిపై తమ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నోత్తరాల సమయాన్ని సస్పెండ్‌ చేసి ఈ అంశంపై చర్చను చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

తగిన సమయంలో వాయిదా తీర్మానాన్ని అనుమతిస్తానని, సభ్యులు తమ ఆందోళనను విరమించి సీట్లలో కూర్చోవాలని స్పీకర్‌ విజరుకుమార్‌ చౌదరి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వినతిని పట్టించుకోని ఆర్‌జెడి సభ్యులు స్పీకర్‌ ముందున్న వెల్‌లో చేరి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. సభలో వున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సైతం వీరితో జత కలిశారు. ఈ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఒక కార్యక్రమంలో నితీష్‌, మోడీలు పాల్గొన్న ఫొటోలను సభలో ప్రదర్శించారు.

ఈ స్వచ్ఛంద సంస్థ ఖాతాలకు ప్రభుత్వం సొమ్మును మోసపూరితంగా బదిలీ చేసిందని, ఈ కుట్రలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు అధికారులు భాగస్వాములయ్యారని విపక్షం ఆరోపించింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ సభలో లేరు. అయితే ఉపముఖ్యమంత్రి మోడీ మాత్రం సభలోనే వున్నారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండటంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఈ సమయంలో బిజెపికి చెందిన మంత్రి నందకిషోర్‌ యాదవ్‌ మాట్లాడుతూ అవినీతి మార్గాలలో బినామీ ఆస్తుల సంపాదించిన వారికి అవినీతిపై మాట్లాడే హక్కు లేదని తేజస్వియాదవ్‌పై విమర్శలు గుప్పించారు.


రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 16 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

Posted a day ago | Category : politics

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు