విద్యాసాగరరావు పై రాష్ట్రపతికి ప్రతిపక్షం ఫిర్యాదు

Posted 6 months ago | Category : politics

ఎంపీ తమిళనాడులో మైనారిటీలో పడిన పళనిస్వామి ప్రభుత్వాన్ని కాపాడటం కోసం గవర్నర్ విద్యాసాగరావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అంటూ ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే, దాని మిత్ర పక్షం కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన ఎంపీలు రాష్ట్రపతిని కలసిన వారిలో ఉన్నారు. 

ఈ సందర్భంగా ఎంపీలు పళనిస్వామి ప్రభుత్వంపై అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్రపతిని కోరారు. అన్నాడీఎంకేలోని దినకరన్‌ వర్గానికి చెందిన 22మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనారిటీలో పడిందని  కోవింద్‌కి వివరించారు. ఈ నేపథ్యంలో వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి పళనిస్వామిపై విశ్వాస పరీక్ష నిర్వహించాలని కోరారు. 

తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్‌గా వ్యవహరిస్తోన్న విద్యాసాగర్‌రావుని బలపరీక్ష నిర్వహించమని కోరినా ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కి వెంటనే ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఎంపీలు రాష్ట్రపతిని కోరారు.రాష్ట్రపతిని కలసిన వారిలో ఆనంద్ శర్మ, సీతారాం ఏచూరి, డి రాజా, కాంజిమోని తదితరులు ఉన్నారు. 

అంతకు ముందు,  రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు బుధవారం రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావుతో భేటీ అయి సీఎం పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలపరీక్ష నిర్వహించాలని లేఖలు అందజేశాయి. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని విద్యాసాగర్‌రావు వారికి తెలిపినట్లు తెలుస్తున్నది. 

కాగా,  అన్నాడీఎంకేలో కొనసాగుతున్న నాటకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయలేమని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం. 


దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!