ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ప్రతిపక్షాల అభ్యర్థి మీరాకుమార్ నామినేషన్

Posted 5 months ago politics

ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ బుధవారం నామినేషన్ వేశారు.  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సియం వీరభద్ర సింగ్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెకు ఎన్సీపీ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌జేఎస్, జేఎంఎం సహా యూపీఏ తరపున మొత్తం 17 పార్టీల మద్దతు ఉంది. గులాం నబీఆజాద్‌, సీతారాం ఏచూరి, శరద్‌ పవార్‌ తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. 

జూన్ 29న నామినేషన్ పత్రాల పరీశీలన పూర్తయ్యాక 30 నుంచి మీరాకుమార్ ప్రచారం ప్రారంభించనున్నట్టు చెబుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రచారం శ్రీకారం చుడతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికైన మీరా కుమార్ ఐఎఫ్ ఎస్ అధికారిగా పనిచేశారు. మాజీ ఉపప్రధాని బాబు జగజీవన్ రామ్ కుమార్తె. 

మీరా కుమార్ మరికొద్ది సేపట్లో నామినేషన్ వేస్తారనగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమెకు ట్విటర్ ద్వారా మద్దతు తెలిపారు. వచ్చే నెల 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అధికార ఎన్డీయే పక్షాల తరపున బీహార్ మాజీ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

Most Read