ఫార్చ్యూన్ 500 జాబితాలో భారత్ నుండి ఏడు కంపెనీలే !

Posted 7 months ago | Category : business

ప్రస్తుత సంవత్సరానికిగాను విడుదలైన ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్‌కు చెందిన 7 సంస్థలకు  మాత్రమే చోటు దక్కింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు (ఐవోసీ) ఈ లిస్ట్‌లో 168వ స్థానం లభించింది. టాప్ 200లో నిలిచిన ఏకైక భారత కంపెనీ ఐవోసీనే.

ఇక ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మిగతా ఆరు దేశీయ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (203వ స్థానం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (217), టాటా మోటార్స్ (247), రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ (295), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (360), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (384) ఉన్నాయి.

గత ఏడాదిలో సంస్థలు ఆర్జించిన ఆదాయం ఆధారంగా ఫార్చ్యూన్ మ్యాగజైన్ సంస్థలకు ర్యాంకింగ్ ఇచ్చింది. ఫార్చ్యూన్ 500 జాబితాలో 40 శాతం ఆసియాకు చెందిన కంపెనీలే కావడం గమనార్హం.  లిస్టులో ఆసియాకు చెందిన 197 సంస్థలకు చోటు దక్కగా ఉత్తర అమెరికా నుంచి 145, యూరప్ నుంచి 143 కంపెనీలకు స్థానం లభించింది.

ప్రపంచంలోని మిగతా ప్రాంతం నుంచి కేవలం 15 సంస్థలో లిస్టులో చోటు సంపాదించుకోగలిగాయి. దేశాలవారీగా చూస్తే అత్యధికంగా అమెరికా నుంచి 132 కంపెనీలకు ఈ జాబితాలో స్థానం లభించింది. చైనా (109 సంస్థలు), జపాన్ (51) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

అమెరికాకు చెందిన సూపర్‌మార్కెట్ల దిగ్గజం వాల్‌మార్ట్ ఈ లిస్టులో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మూడు స్థానాలు చైనాకు చెందిన ఇంధన రంగ సంస్థలు స్టేట్ గ్రిడ్, సినోపెక్, చైనా పెట్రోలియంలకు దక్కాయి. టయోటా, ఫోక్స్‌వ్యాగన్, రాయల్ డచ్ షెల్, బెర్క్‌షైర్ హ్యాత్‌వే, ఆపిల్ కంప్యూటర్స్, ఎక్సాన్ మొబిల్‌లకు టాప్ టెన్‌లో చోటు లభించింది.


లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 2 days ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 14 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 15 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 15 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 15 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 17 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 18 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 22 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 22 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 22 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 23 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !