//single page style gallary page

ట్రంప్ నిష్క్రమణ గురించి ఆన్‌లైన్‌లో జోరుగా బెట్టింగ్‌

Posted a year ago | Category : world politics

అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టిన ఐదు నెలలకే ఆయన పదవి నుండి నిష్క్రమించడం తధ్యం అంటూ అమెరికాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ అర్ధాంతరంగా నిష్క్రమిస్తారని అంటూ  ఇప్పుడు ఆన్‌లైన్‌లో జోరుగా బెట్టింగ్‌ సాగుతోంది. ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కామీకి ట్రంప్‌ అర్ధంతరంగా ఉద్వాసన పలికిన వివాదం నేపథ్యంలో ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మరింతగా విస్తరిస్తోంది.

 ట్రంప్‌ను అమెరికన్‌ కాంగ్రెస్‌ అభిశంసించనుందన్న అంశంపై అనుకూల, ప్రతికూల వాదనలతో గత కొద్దీ రోజులుగా రాజకీయ కాంట్రాక్ట్‌లు 'ప్రెడిక్టిట్‌' వంటి ఆన్‌లైన్‌ రాజకీయ స్టాక్‌ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఇక బ్రిటన్‌కు చెందిన మరికొందరు ఔత్సాహికులు ట్రంప్‌ తన పదవీ కాలం పూర్తయ్యే 2021 వరకూ అధికారంలో వుంటారా? వుండరా అన్న అంశంపై బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. 

డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసనకు గురవుతారా? అన్న అంశంపై  24 గంటల వ్యవధిలోనే దాదాపు లక్షకు పైగా కాంట్రాక్ట్‌లు ప్రెడిక్టిట్‌కు చేరాయి. వైట్‌హౌస్‌ మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్‌ ఫ్లిన్‌కు రష్యాకు మధ్య సంబంధాలపై ఎఫ్‌బిఐ కొనసాగిస్తున్న దర్యాప్తును అర్ధంతరంగా నిలిపివేయాలని ట్రంప్‌ తనకు చెప్పినట్లు కామీ అమెరికన్‌ కాంగ్రెస్‌కు లిఖితపూర్వకంగా వెల్లడించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ కాంట్రాక్ట్‌ల వెల్లువ ఊపందుకుంది. 

రెండు రోజుల క్రితం ఒక దశలో  ఈ అభిశంసన ప్రశ్నకు 'అవును' అన్న జవాబుతో రికార్డు స్థాయిలో  అవకాశాలు 33 శాతం మేర వున్నట్లు ఈ ట్రేడింగ్‌ ద్వారా వెల్లడైనది.  వారం రోజుల క్రితం ఇది కేవలం 7 శాతం మాత్రమే వుండటం విశేషం. ప్రెడిక్టిట్‌ ఆన్‌లైన్‌ రాజకీయ స్టాక్‌మార్కెట్‌ను వాషింగ్టన్‌ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ అరిస్టాటిల్‌, న్యూజిలాండ్‌ రాజధాని వెల్లింగ్టన్‌లోని విక్టోరియా యూనివర్శిటీ సంయుక్తంగా నిర్వహి స్తున్నాయి. 

ఈ స్టాక్‌ మార్కెట్‌ వినియోగదారులంతా అమెరికాలో అర్హులైన ఓటర్లే కావటం విశేషం. మొత్తమ్మీద ట్రెగ్జిట్‌కు సంబంధించిన ఈ ట్రేడింగ్‌ దాదాపు 2.7 లక్షల డాలర్లకు పైగా ధరపలకటం గమనార్హం. కాగా బ్రిటిష్‌ బెట్టింగ్‌ సంస్థ లాడ్‌బ్రోక్స్‌ ట్రంప్‌ అభిశంసన కాంట్రాక్ట్‌ ధరను 11-10 పౌండ్ల నుండి 4-5 పౌండ్ల స్థాయికి తగ్గించటంతో ట్రంప్‌ అభిశంసనకు 56 శాతం మేర అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వెలువడ్డాయి.


బీజేపీ, వైసీపీ ర‌హ‌స్య స‌మావేశాలు..!

Posted 18 minutes ago | Category : politics

బీజేపీ, వైసీపీ ర‌హ‌స్య స‌మావేశాలు..!

బీజేపీతో వైసీపీ పొత్తు సాక్షాలతో సహా బట్టబయలు ..!

Posted 15 hours ago | Category : politics

బీజేపీతో వైసీపీ పొత్తు సాక్షాలతో సహా బట్టబయలు ..!

సీఎం చంద్ర‌బాబు పై కేంద్ర రైల్వే మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Posted 16 hours ago | Category : politics

సీఎం చంద్ర‌బాబు పై కేంద్ర రైల్వే మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

గ‌వ‌ర్న‌ర్ కొత్త డ్రామా.. సాక్ష్యాల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు..!

Posted 17 hours ago | Category : politics

గ‌వ‌ర్న‌ర్ కొత్త డ్రామా.. సాక్ష్యాల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు..!

దేశ రాజ‌ధాని సాక్షిగా చంద్ర‌బాబు పై కుట్ర‌లు..!

Posted 17 hours ago | Category : politics

దేశ రాజ‌ధాని సాక్షిగా చంద్ర‌బాబు పై కుట్ర‌లు..!

బ్రాహ్మ‌ణ సంఘాల‌కు.. వైఎస్ జ‌గ‌న్ తీవ్ర అవ‌మానం..!

Posted 21 hours ago | Category : politics

బ్రాహ్మ‌ణ సంఘాల‌కు.. వైఎస్ జ‌గ‌న్ తీవ్ర అవ‌మానం..!

జ‌గ‌న్‌కి స‌వాల్ విసిరిన లోకేష్‌..!

Posted a day ago | Category : politics

జ‌గ‌న్‌కి స‌వాల్ విసిరిన లోకేష్‌..!

టీఆర్ఎస్ - బీజేపీ పొత్తుతో ఎంపీ క‌విత క‌ల నిజ‌మ‌వుతుందా..?

Posted a day ago | Category : politics

టీఆర్ఎస్ - బీజేపీ పొత్తుతో ఎంపీ క‌విత క‌ల నిజ‌మ‌వుతుందా..?

బీజేపీ, వైసీపీ ర‌హ‌స్య స‌మావేశాలు..!

Posted a day ago | Category : politics

బీజేపీ, వైసీపీ ర‌హ‌స్య స‌మావేశాలు..!

ప్ర‌ధాని మోదీకి ద‌డ పుట్టిస్తున్న చంద్ర‌బాబు..!

Posted a day ago | Category : politics

ప్ర‌ధాని మోదీకి ద‌డ పుట్టిస్తున్న చంద్ర‌బాబు..!

ఏపీ బీజేపీ సీఎం అభ్య‌ర్థి ఖ‌రారు..!

Posted 2 days ago | Category : politics

ఏపీ బీజేపీ సీఎం అభ్య‌ర్థి ఖ‌రారు..!