ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

మరోసారి సురవరం నోట వామపక్షాల విలీనం మాట

Posted 5 months ago politics

తమ అనైక్యతే దేశంలో వామపక్షాల బలం తగ్గిపోవడానికి దారితీస్తున్నదని దేశంలో మొదటి సారిగా గుర్తించిన సిపిఐ తిరిగి రెండు ప్రధాన వామపక్షాలు విలీనం కావాలని నాలుగు దశాబ్దాలకు పైగా ప్రతిపాదిస్తున్నది. అయితే ఈ  విషయంలో మొదటి నుండి సిపియం మొండివైఖరి అనుసరిస్తున్నది. 

70వ  దశకంలోనే  నాటి సిపిఐ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు రెండు వామపక్షాల విలీనం ప్రతిపాదనను ముందుంచారు. అయితే విలీనం  కాదు, ముందుగా కలసి ప్రజా ఉద్యమాలు  జరుపుదాం, ఎన్నికల్లో పోటీ  చేద్దాం అంటూ సిపియం దాటవేస్తూ వస్తున్నది. అనేక సందర్భాలలో ఎవ్వరి దారి వారిదిగా ఉంటూ వస్తున్నది. 

తిరిగి ఈ విలీనం అంశాన్ని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెరపైకి తెచ్చారు. రాబోయే ఐదేళ్లలో సీపీఐతో సీపీఎం విలీనం అవుతుందని   ఆయన జోస్యం చెప్పారు.  కమ్యూనిస్టు పార్టీ చీలిపోయిన 1964 నాటి పరిస్థితులు ఇప్పుడు లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా చెప్పారు. సయోధ్యతో కలిసి ఉంటేనే మనుగడ సాధించగలమని, లేకుంటే రెండింటికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 

ఒకే లక్ష్యంతో, సారూప్యతతో పోరాటాలు సాగిస్తున్న రెండు పార్టీలు  వేర్వేరుగా ఉండి ఉద్యమాలు కొనసాగించటం నేడు కష్టతరంగా మారిందని గుర్తు చేస్తూ ఎవ్వరికి వారుగా ఉంటే రాజకీయ మనుగడ కూడా కష్టం కాగలదని సురవరం సంకేతం ఇచ్చారు. "మేం కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. రాత్రికిరాత్రే పరిస్థితి మారుతుందని చెప్పటం లేదు. కానీ, ఫలితం మాత్రం ఉండి తీరుతుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

అయితే  ఏకీకరణ విషయంలో మాత్రం ముఖాముఖి చర్చలు జరుగలేదని అయన చెప్పారు. రెండు పార్టీల్లోనూ విలీనంపై కొంత సానుకూల దృక్పథం ఉన్నప్పటికి సీసీఎం నాయకత్వం తమ పార్టీతో చర్చించలేదని అంటూ ఈ విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న మొండి ధోరణిని ప్రస్తావించారు. 

వచ్చే ఏడాదిలో రెండు పార్టీల ఉన్నత స్థాయి సమావేశాలు ఉన్న దృష్ట్యా విలీనం విషయం అప్పుడే ప్రస్తావనకు వస్తుందని  ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకుని రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో విలీన ప్రక్రియ పూర్తి చేసుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం  చేశారు.

Related Articles

Most Read