అద్వానీని అరెస్ట్ చేసిన అధికారికి మంత్రి పదవి

Posted 6 months ago | Category : politics

స‌రిగ్గా 26 ఏళ్ల కింద‌ట బీజేపీ కురువృద్ధుడు, సీనియ‌ర్ నేత ఎల్‌కే అద్వానీ ర‌థ్ యాత్ర చేప‌ట్టినసందర్భంగా బీహార్  లోకి ప్రవేశించినప్పుడు అరెస్ట్ చేసిన అధికారి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చేరారు.  గుజ‌రాత్‌లోని సోమ్‌నాథ్ నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య వ‌ర‌కు  చేపట్టిన యాత్ర సందర్భంగా బీహార్‌లోకి ప్ర‌వేశించిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆయ‌న‌ను అరెస్ట్ చేయాల‌ని ఆదేశించారు. అందుకోసం ఇద్ద‌రు అధికారుల‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

అందులో ఒక‌రు రాజ్‌కుమార్ సింగ్‌. ఆయ‌నే ఇప్పుడు మోదీ కేబినెట్‌లో మంత్రిగా ప్ర‌మాణం చేశారు. అక్టోబ‌ర్‌, 1990లో ఆర్కే సింగ్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌. బీహార్ ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ఆ రోజు ప్ర‌భుత్వ ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ఆర్కే సింగ్ పాట్నా నుంచి స‌మ‌స్తిపూర్‌కు వెళ్లారు. ఆయ‌న వెంట ఐపీయస్ అధికారి రామేశ్వ‌ర్ ఓరాన్ కూడా ఉన్నారు.

అద్వానీ ఉన్న స‌ర్క్కూట్ హౌజ్‌కు వెళ్లి మిమ్మ‌ల్ని అరెస్ట్ చేయాల‌ని వారెంట్ జారీ అయింది అని చెప్పింది ఆర్కే సింగే. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి అద్వానీ తీసుకొని మ‌ళ్లీ పాట్నా వెళ్లారు. ప్ర‌స్తుత జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న మ‌సాంజ‌ర్ గెస్ట్ హౌజ్‌కు అద్వానీని త‌ర‌లించారు. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ అద్వానీ చేసిన ఈ ర‌థ్ యాత్రే బీజేపీ రాత‌ను మార్చేసింది.

ఈ ర‌థ్ యాత్ర ముగిసిన ఆరేళ్ల త‌ర్వాత తొలిసారి బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అద్వానీ ఉపప్రధాని అయ్యారు. ఇప్పుడు అద్వానీ కేవలం ఎంపీ ప‌ద‌వికే పరిమితం కాగా  ఆయ‌ను అప్ప‌ట్లో అరెస్ట్ చేసిన ఆర్కే సింగ్ మంత్రి అయ్యారు. 1975 బ్యాచ్ బీహార్ కేడర్‌ ఆఫీసర్ అయిన రాజ్‌కుమార్ సింగ్‌ యూపీఏ ప్ర‌భుత్వంలో కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శిగా కూడా ప‌నిచేశారు. 2014 ఎన్నిక‌ల ముందు బీజేపీలో చేరారు. బీహార్‌లోని ఆరా నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేసి గెలిచారు.


దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!