ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఇప్పుడు ఈవీఎంలో వేసిన ఓటు చూడొచ్చు..

Posted 8 months ago politics national

భారతదేశంలో ఎన్నికలు అంటే ఎప్పుడు వివాదాలే. పోలింగ్ రోజున అయితే ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. మొదట్లో బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించేవారు. పత్రాల ద్వారా అయితే రిగ్గింగ్ కు పాల్పడే అవకాశాలు అధికం. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావని గ్రహిస్తే, బ్యాలెట్ బాక్స్ లను ఎత్తుకెళ్ళటం లేదా దానిలో ఇంకును పోయటం వంటివి చేసేవారు. దీంతో ఎలక్షన్ నిర్వహణ తలకుమించిన భారంగా ఉండేది. ఇటువంటి ఎలక్షన్ వల్ల ఫలితాలు కూడా వెల్లడించడానికి ఇబ్బందికరంగా వుండేది.

దీంతో ఎలక్షన్ అధికారులు కాలానుగుణంగా వచ్చే మార్పులను, పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. అక్రమాలకు స్వస్తి చెపుతూ, ఎన్నికల నిర్వహణను సులభతరం చేసింది ఎలక్షన్ కమిటీ .

కానీ ఈ యంత్రాల పట్ల చాలా మందికి నమ్మకం లేదు. తాము వేసిన ఓటు ఎవరికి వెళ్లిందో తెలియటంలేదని, ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని చాలా మంది విమర్శలు చేశారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు వాటిని రిగ్గింగ్ చేస్తున్నారని, ఓటు ఎవరికి వేసిన అది తమకే వచ్చేలా చేసి విజయాలు సాధిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. తాజాగా యూపీ, ఉత్తరాఖండ్ లో జరిగిన ఎలక్షన్ ల అనంతరం ఈ విమర్శలు ఎక్కువయ్యాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆప్ అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రి వాల్ ఈవీఎం లను తీవ్రంగా వ్యతిరేకించారు.

వీటిపై స్పందించిన ఎన్నికల సంఘం(ఈసీ) ఈవీఎంలను ట్యాపరింగ్ చేయటం సాధ్యంకాదని ఎన్ని దఫాలుగా వివరించిన ప్రయోజనం లేకపోయింది. దీంతో కంప్యూటర్ నిపుణులు, రాజకీయ నేతలు, ఇంజనీరింగ్ నిపుణులు ఎవరైనా సరే ఈవీఎం లను ట్యాపరింగ్ చేసి చూపించగలరేమో ప్రయత్నించాలని సవాలు విసిరింది.

అంతేకాకుండా ఈ ఆరోపణలకు చెక్ పెట్టేలా వీవీపాట్ లను అందుబాటులోకి తీసుకురానున్నది. VVPAT -(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ )ను ఈవీఎంలకు అనుసంధానించడం వలన వేసిన ఓటు ఎవరికి వెళ్లిందని తెలుసుకునేందుకు ఈ వీవీపాట్ లు ఉపయోగపడతాయి. ఈ సదుపాయం ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పెంచుతు 2019 ఎన్నికల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

వీటి కొనుగోలుకు రూ.3700 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్రాన్ని కోరటంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 16.15 లక్షల వీవీపాట్ లను కొనుగోలు చేయనున్నట్లు ఈసీ తెలిపింది. వీటిని ప్రభుత్వ సంస్థలైన ఈసీఐఎల్, బీఈఎల్ లు తయారుచేయనున్నాయి.

Related Articles

Most Read