ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

సైబర్ దాడుల వెనుక ఉత్తర కొరియాకు చెందిన యూనిట్-180

Posted 6 months ago world

గత వారం ప్రపంచాన్ని  వణికించిన సైబర్ దాడికి పాల్పడింది ఉత్తర కొరియా గూఢచార సంస్థ ఆర్జీబీకి అనుబంధంగా పనిచేస్తున్న యూనిట్-180 అనే ప్రత్యేక విభాగం అని స్పష్టం అవుతున్నది. ఈ విభాగం కేవలం ఆర్థిక నెట్‌వర్క్‌లే లక్ష్యంగా పలు సంవత్సరాలుగా ఇటువంటి దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది. 

ఇటువంటి ఆరోపణలను ఉత్తర కొరియా ఖండిస్తున్నప్పటికీ, ఆ దేశానికి వ్యతిరేకంగా తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని దక్షిణ కొరియా అధికారులు స్పష్టం చేస్తున్నారు.  ఇంటర్నెట్ భద్రతా నిపుణులు సహితం ఉత్తర కొరియా వైపే వేలెత్తి చూపుతున్నారు. 

 అమెరికా, దక్షిణ కొరియాతోపాటు మరో డజన్ ఇతర దేశాల్లోని ఆర్థిక నెట్‌వర్క్‌పై యూనిట్-180 గత కొన్నేండ్లలో పలుమార్లు సైబర్ దాడులకు పాల్పడిందని వారు తెలిపారు.  గతవారం 150 దేశాల్లోని మూడు లక్షల కంప్యూటర్లను ధ్వంసం చేసిన వన్నాక్రై రాన్సమ్‌వేర్ వెనుక కూడా ఉత్తర కొరియా కు చెందిన ఈ యూనిట్ హస్తం ఉన్నట్టు తమవద్ద సాంకేతికపరమైన ఆధారాలున్నాయని సైబర్ పరిశోధకులు అంటున్నారు. 

గత ఏడాది బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్‌పై, అంతకుముందు 2014లో సోనీ హాలీవుడ్ స్టూడియోపై సైబర్ దాడికి పాల్పడి 81 మిలియన్ డాలర్లు దోచుకున్న లాజరస్ హ్యాకింగ్ గ్రూపునకు కూడా ఉత్తర కొరియాతో సంబంధాలున్నట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. బంగ్లాదేశ్ బ్యాంక్ దోపిడీపై ప్యాంగ్‌యాంగ్‌కు వ్యతిరేకంగా కేసు బనాయిస్తున్నట్టు అమెరికా అధికారులు తెలిపారు. 

అత్యంత రహస్యంగా తమ కార్యకలాపాలు నిర్వహించే దేశాలలో ఉత్తర కొరియా ఒకటి. దాని ఆర్థిక లావాదేవీల వివరాలను బయటకు రాబట్టడం అతికష్టమని నిపుణులు పేర్కొంటారు.  కానీ ఈ దేశంపై అధ్యయనం చేసిన నిపుణులు లేదా దానిపై తిరుగుబాటుచేసి దక్షిణ కొరియాలో స్థిరపడిన వారు కొన్ని ఆధారాలను అందించారు. 

అలాంటి వారిలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ కిమ్ హ్యూంగ్ క్వాంగ్ ఒకరు. దక్షిణ కొరియాలో 2004 నుంచి నివసిస్త్ను కిమ్ నిధులు పోగు చేసుకొనేందుకే ప్యాంగ్‌యాంగ్ సైబర్ దాడులకు పాల్పడుతుందని చెప్పారు. ఈ దాడులను యూనిట్-180 ద్వారా నిర్వహిస్తారని తెలిపారు. గత ఏడాది జూన్‌లో దక్షిణ కొరియాకు చెందిన 160 కంపెనీలలోని 1.40 లక్షల కంప్యూటర్లను వారు హ్యాక్ చేశారని అన్నారు.

ఈ యూనిట్-180 ఆర్థిక సంస్థలు, ఇతరుల బ్యాంక్ అకౌంట్లలోకి చొచ్చుకుపోయి డబ్బును దొంగిలిస్తుందని అన్నారు. తన మాజీ విద్యార్థులు కొందరు ప్రస్తుతం ఉత్తర కొరియా సైబర్ ఆర్మీలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. 

సైబర్ ఆర్మీకి చెందిన సభ్యులు ఇంటర్నెట్ నెట్‌వర్క్ బాగా పనిచేసే దేశాలకు వెళ్లి తమ లక్ష్యాన్ని సాధిస్తారు. వారు ఉత్తర కొరియాకు చెందిన కంపెనీల విదేశీ శాఖల ఉద్యోగులుగా లేదా చైనా, ఆగ్నేయాసియా దేశాల్లోని జాయింట్ వెంచర్ కంపెనీల సిబ్బందిగా వెళ్లి తమ పనిచేసుకుంటారు అని తెలిపారు. 

Most Read