కొత్త బెంజ్‌ కారు వద్దు... పాత కారు చాలన్న యోగి

Posted 7 months ago | Category : politics

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు నో చెప్పి మ‌రోసారి ఆద‌ర్శంగా నిలిచారు. త‌నతోపాటు త‌న కాన్వాయ్ కోసం రెండు కొత్త మెర్సిడీజ్ బెంజ్‌ ఎస్‌యూవీల‌ను కొంటామ‌న్న అక్క‌డ ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ ప్ర‌తిపాద‌న‌ను ఆయ‌న తిరస్క‌రించారు. మాజీ  ముఖ్యమంత్రి  అఖిలేష్ యాదవ్ వాడిన బెంజ్ కారే త‌న‌కు చాల‌ని, కొత్త‌వి అవ‌స‌రం లేద‌ని యోగి స్ప‌ష్టంచేశారు. 

ఆయ‌న నిర్ణ‌యం వ‌ల్ల ఖ‌జానాకు రూ.5 కోట్ల భారం త‌ప్పింది. అంతేకాదు మంత్రుల‌కు టొయోటా ఫార్చున‌ర్ కార్లు తీసుకోవాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను కూడా యోగి తిర‌స్క‌రించారు. వాళ్లు టొయోటా ఇన్నోవా చాల‌ని చెప్పారు. 

ఫార్చున‌ర్ ఒక్కోదానికి రూ.31 ల‌క్ష‌ల వ‌ర‌కు అవుతుండ‌గా, ఇన్నోవా అందులో సగం మొత్తంతో వ‌చ్చేస్తుంది. యోగికి భిన్నంగా గ‌తంలో ఉన్న అఖిలేష్‌, మాయావ‌తి మాత్రం అధికారంలోకి రాగానే ఖ‌రీదైన కార్ల‌కు ఆర్డ‌ర్లు ఇచ్చారు. ఎస్పీ ప్ర‌భుత్వంలో అయితే అఖిలేష్‌కు తీసుకున్న కారునే అప్ప‌టి ఎస్పీ చీఫ్ ములాయంకు కూడా ఇచ్చారు. ప్ర‌భుత్వం దిగిపోగానే అఖిలేష్ త‌న కారును తిరిగి ఇచ్చేయ‌గా, ములాయం మాత్రం ఇంకా అందులోనూ తిరుగుతున్నారు. 

ఆయ‌న నుంచి ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవాల‌ని ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ భావించినా, సీఎం యోగి అడ్డు చెప్పారు. ములాయం పెద్ద‌వార‌ని, అలాంటి వ్య‌క్తి నుంచి బ‌ల‌వంతంగా తీసుకోవ‌డం స‌రి కాద‌ని, ఆయ‌నే ఇచ్చే వర‌కు వేచి చూడాల‌ని అధికారుల‌కు యోగి స్ప‌ష్టంచేశారు.


రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 13 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 4 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 4 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!