కమల్ కు బీజేపీ వద్దు... లెఫ్ట్ లే హీరోలు

Posted 6 months ago | Category : politics

త‌్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌న్న త‌మిళ సూప‌ర్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ తన రాజకీయ గమ్యంపై స్పష్టమైన సంకేతాలు మరోసారి ఇచ్చారు. ఏపార్టీతో చేతులు కలిపినా బీజేపీతో  మాత్రం కలిసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

రాజకీయ ప్రవేశం ఎప్పుడో అన్న విష‌యంపై క్లారిటీ ఇవ్వ‌క‌పోయినా క‌చ్చితంగా బీజేపీలో మాత్రం చేర‌న‌ని స్ప‌ష్టంచేశాడు. "40 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నాను. నా రంగేంటో అంద‌రికీ తెలుసు. క‌చ్చితంగా కాషాయం మాత్రం కాదు"  అని క‌మ‌ల్ తెలిపారు.

కేరళ పర్యటనలో అక్కడ ముఖ్యమంత్రి విజయన్ ను కలసిన అనంతరం ఇదే అంశంపై  విజ‌య‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాన‌ని, ఆయ‌న స‌ల‌హాలు తీసుకుంటున్న‌ట్లు చెప్పాడు. తనకు వామపక్ష నేతలు పలువురితో పరిచయాలు ఉన్నాయని అంటూ లెఫ్టిస్టులు తన హీరోలని కూడా నవ్వుతూ చెప్పుకొచ్చారు.

తన చాలా సినిమాల్లో లెఫ్టిస్ట్ భావజాలం కనిపిస్తుందని చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. ప్రభుత్వం ఏర్పాటనేది ప్రధానం కాదనీ, ప్రజలే ముఖ్యమని కమల్ సమాధానమిచ్చారు.

మ‌రింత మంది రాజ‌కీయ నేత‌ల‌తో చ‌ర్చించి దీనిపై తుది నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు పేర్కొన్నారు. తాను ఎవ‌రి ప‌క్షం వ‌హించ‌న‌ని, త‌ట‌స్థంగా ఉండ‌టానికే ప్ర‌య‌త్నిస్తాన‌ని కూడా క‌మ‌ల్ స్ప‌ష్టంచేశాడు. రాజకీయ ప్రవేశంపై త్వరలో ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.


రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 16 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

Posted a day ago | Category : politics

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు