కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన నితీష్

Posted 8 months ago | Category : politics

రెండు నెలల క్రితమే 2019  ఎన్నికల సమయానికి బీహార్ లో వలే బిజెపి వ్యతిరేక పార్టీలతో మహాకూటమి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి, మద్దతు సమీకరించడం కోసం ప్రయత్నం చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా బిజెపి అభ్యర్థికి మద్దతు పలకడం కాంగ్రెస్, వామపక్షాలకు షాక్ ఇచ్చిన్నట్లు అయింది.  కాంగ్రెస్ ప్రతిపక్షాలను ఒక వేదికపైకి తీసుకు రాలేదని నిర్ధారించుకున్న తరువాతనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. 

మొదటగా తమ పార్టీకి చెందిన శరద్ యాదవ్ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా నితీష్ కుమార్ తెరపైకి తీసుకు వచ్చారు. అయితే ఇతర పార్టీల నుండి చెప్పుకోదగిన మద్దతు కనిపించలేదు. 2019  లలో నరేంద్ర మోడీ ని ఓడించగల స్థైర్యం కాంగ్రెస్ వద్ద లేదని గ్రహించారు. పోతే తనను ప్రధాన మంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అంగీకరించే సూచనలు కనిపించలేదు. 

మరోవంక బీహార్ లో తన భాగస్వామ్య పక్షం ఆర్ జె డి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా గడ్డి కుంభకోణంలో తాజా విచారణను ఎదుర్కొనవలసి రావడం, ఆయన కుటుంభం సభ్యులపై సుమారు రూ 1,000 కోట్ల అక్రమార్జన ఆరోపణలపై ఆదాయపన్ను శాఖ దాడులు, కేసులు ఎదుర్కోవడంతో నితీష్ అసహనంగా భావిస్తున్నారు. పైగా 15 ఏళ్లుగా అవినీతిని సహించని రాజకీయ నాయకుడిగా తెచ్చుకున్న పేరు పోతున్నదని ఆందోళన చెందుతున్నారు. దానితో లాలూతో తెగతెంపులు చేసుకోవడం కోసం బిజెపి అండ తప్పనిసరని గ్రహించారు. 

ఇంకొకవైపు పదేళ్లుగా బీహార్ లో మహాదళిత్ వర్గాల మద్దతును కూడదీసుకుని, తన అధికారాన్ని పదిల పరచు కొంటున్నారు. వారికి రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించారు. ఇప్పుడు ఆ వర్గానికి చెందిన కోవింద్ ను బిజెపి అభ్యర్థిగా చేయడంతో వ్యతిరేకించడం రాజకీయంగా తనకు ఇబ్బందికరం అని భావిస్తున్నారు. 


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 2 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 2 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 2 days ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 2 days ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 2 days ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!