ప్రధానమంత్రి పదవి పోటీలో లేనని స్పష్టం చేసిన నితీష్ కుమార్ !

Posted 9 months ago | Category : national politics

బిజెపియేతర కూటమిలో 2019 ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్థిగా విశేష ప్రచారంలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తానీ పోటీలో లేనని స్పష్టం చేశారు.  తన పేరును అనవసరంగా ఈ పోటీలోకి లాగుతున్నారని అంటూ తమది  చాల చిన్న పార్టీ అని, ప్రధానమంత్రి పదవి కోరుకొనే తెలివితక్కువ వాడిని తాను కాదని తెలిపారు.

తాను  తమ పార్టీ జెడి (యు) జాతీయ అధ్యక్షుడిని అయ్యాను అంటే తనకు జాతీయ స్థాయిలో రాజకీయ అభిలాషలు ఉన్నాయనే అర్ధం కాదని ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. అయితే ప్రజలు ఎవ్వరికీ అటువంటి సామర్ధ్యం ఉన్నదని అనుకుంటారో వారు ఆ పదవికి ఎన్నిక అవుతారని అంటూ 2014లో ప్రజలు అదే విధంగా నరేంద్ర మోడీ ని ఎన్నుకున్నరని పేర్కొన్నారు. 

అప్పుడు మోడీ కేవలం ఒక రాష్త్రానికి ముఖ్యమంత్రి మాత్రమే, అంతకు ఐదేళ్ల ముందు ఆయననెవ్వరూ ప్రధాని పదవికి అభ్యర్హ్దిగా భావించలేదని గుర్తు చేశారు. కాగా, బిజెపి కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్ని బీహార్ లో వలే జాతీయ స్థాయిలో `మహా కూటమి'గా  ఏర్పాటు కావలసిన అవసరం ఉన్నదని నితీష్ స్పష్టం చేశారు. 

పలు విషయాలలో ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉందట సహజమే అని సమర్ధించుకున్నారు. బీహార్ లో తమ పార్టీకి, ఆర్జేడీ ల మధ్య కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. నోట్లరద్దు విషయంలో తమ రెండు పార్టీల అభిప్రాయాలు వేరని అంటూ, ఇప్పుడు ఇవియం ల విషయంలో కూడా అంతే అని అన్నారు. 

తాను పదవుల కోసం ఎగబడటం కన్నా ప్రజలకోసం పని చేయడం పట్ల విశ్వసిస్తానని అంటూ యంపీగా, కేంద్ర మంత్రిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజల కోసమే పనిచేస్తున్నానని అన్నారు. 


రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 14 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted 21 hours ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 2 days ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 3 days ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 3 days ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!