ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

నితీష్ లాలూతో రామ్ రామ్ ... తిరిగి కమలంతో దోస్తీ

Posted 4 months ago politics

బీహార్ మహాకూటమి బద్దలైంది. లాలూ తనయుడు, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలతో ఇక ముందుకు సాగలేనంటూ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ రాజీనామా అస్త్రాన్ని సంధించారు. చకచకా చోటు చేసుకున్న పరిణామాలతో మహాకూటమి సీఎంగా ఉన్న నితీశ్ రాత్రికిరాత్రే ఎన్డీయే సీఎంగా అవతారం ఎత్తబోతున్నారు.

మహా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీతో పూడ్చలేని స్థాయిలో విభేదాలు తలెత్తడంతో రాజీనామా చేసినట్లు నీతీశ్‌ తెలిపారు. తాను ఎవరి రాజీనామానూ కోరలేదనీ, అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా మాత్రమే తేజస్వీయాదవ్‌ను అడిగాననీ స్పష్టం చేశారు. బినామీ ఆస్తులపై పోరాడాలని చెప్పిన తానే వాటిపై ఎలా వెనక్కి తగ్గగలనని ప్రశ్నించారు.

కూటమిని కాపాడేందుకు అందరి తలుపులూ తట్టాననీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీనీ తాను కలిసినా ఏమీ ఒరగలేదనీ చెప్పారు. అందుకే అంతరాత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకున్నానని వివరించారు. తేజస్వీ తనంతట తానుగా రాజీనామా చేసి ఉంటే స్థాయి పెరిగి ఉండేదనీ, తానెవరినీ నిందించదలచుకోలేదనీ చెప్పారు.

అనూహ్యంగా నితీశ్ తీసుకున్న నిర్ణయంతో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. నితీశ్ నిర్ణయంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. గురువారం సాయంత్రం 5 గంటలకు నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణం చేయనున్నారు. మధ్యంతర ఎన్నికలను నివారించేందుకు నితీశ్ సీఎంగా బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు తెలియజేస్తున్నట్టు బీహార్ బీజేపీ ప్రకటించింది. ఆ మేరకు గవర్నర్‌కు లేఖను అందజేసింది.

అవినీతిపై పోరులో చేరినందుకు శభాష్ నితీశ్ అంటూ ప్రధాని నరేంద్రమోదీ కితాబిచ్చారు. ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై ఆరోపణలున్న సంగతి ఇప్పుడే తెలిసొచ్చిందా? అంటూ ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ నితీశ్‌పై మండిపడ్డారు. నితీశ్‌పై హత్యకేసు విచారణలో ఉందని, త్వరలో ఉచ్చు బిగుస్తుందనే భయంతోనే రాజీనామా నాటకం ఆడుతున్నారని లాలూ ధ్వజమెత్తారు.

నితీశ్ రాజీనామా చేసిన వెంటనే సుశీల్‌కుమార్ బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఇంటికి వెళ్లి జేడీయూ శాసనసభ్యులతో భేటీ అయ్యారు. అనంతరం అర్థరాత్రి వీరు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిం చాలని కోరారు.మొత్తంమీద నితీశ్ ముఖ్యమంత్రిగా, సుశీల్‌కుమార్ మోదీ ఉపముఖ్యమంత్రిగా బీహార్‌లో మరోసారి ఎన్డీయే సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

ప్రస్తుతం గవర్నర్ కేఎన్ త్రిపాఠీ స్వల్ప అస్వస్థతతో పాట్నాలోని ప్రభుత్వ దవాఖానలో చేరారు. కాగా, శాసనసభలో తమదే అతిపెద్ద పార్టీ అన్న లాలూ ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరుతామని చెప్పారు.

Related Articles

Most Read