బిజెపి ప్రలోభాలకు లొంగని నితీష్ కుమార్

Posted 9 months ago | Category : politics

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశుదాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై విచారణ కొనసాగించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయగానే బిజెపి వర్గాలలో సంతోషం వెల్లివిరిసింది. దీనిని సాకుగా తీసుకొని బీహార్ ముఖ్యనంత్రి నితీష్ కుమార్ ను ప్రతిపక్ష శిబిరం నుండి తమ వైపుకు తిప్పుకోవచ్చని ఆశపడ్డాయి. 

సుప్రీం కోర్ట్ తీర్పు రాగానే తమతో చేతులు కలపాలని బీహార్ లో బిజెపి నేత సుశీల్ మోడీ బహిరంగ ఆహ్వానం పలికారు. ఎన్డీయే లోకి తిరిగి రావాలని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్వాగతం పలికారు. ఎన్డీయే లో 17 ఏళ్లపాటు ఉన్నతరువాత నాలుగేళ్ల క్రితమే ఆయన దూరం కావడం తెలిసినదే. పైగా రెండేళ్ల క్రితం రాజకీయ ప్రత్యర్థి లాలూ ప్రసాద్ తో చేతులు కలిపి బీహార్ లో నరేంద్ర మోడీ ప్రభంజనానికి గండి కొట్టారు కూడా. 

నితీష్ కుమార్ ను తమవైపుకు తిప్పుకొంటే ప్రతిపక్ష శిబిరంలో బిజెపి వ్యతిరేక శక్తులను ఒకచోట చేర్చడంలో బలమైన నాయకులెవ్వరూ ఉండరని బిజెపి ఎత్తుగడగా కనిపిస్తున్నది. దానితో 2019 ఎన్నికలు ఏకపక్షం కాగలవని అంచనా వేస్తున్నది. 

అయితే బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటుకోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న నితీష్ కుమార్ సుప్రీం కోర్ట్ తీర్పుతో మరింత బలపడిన్నట్లు భావించడం బిజెపి వర్గాలకు షాక్ కలిగిస్తున్నది. పశుదాణా కేసులో లాలూకి జైలు శిక్ష పడిన తరువాతనే చేతులు కలపడంతో తాజా సుప్రీం తీర్పు పెద్ద ఇబ్బంది కలిగించడం లేదు. పైగా బిజెపి తో చేరితే ప్రధాని మోడీ కి ప్రత్యామ్న్యాయ నాయకుడిగా ఎదగడం సాధ్యం కాదు కదా. 

పైగా బీహార్ అసెంబ్లీ లో ఆర్జేడీ కన్నా తనకు తక్కవ బలం ఉన్నా పాలనలో తనకు అడ్డులేకుండా ఉండటంతో ప్రతిపక్ష శిబిరంలో తిరుగులేని నాయకుడిగా నితీష్ ఎదుగుతున్నారు. ఇప్పటికే ఆయన సోనియా, శరద్ పవర్, నవీన్ పట్నాయక్, కనిమోజహి, సీతారాం  ఏచూరి వంటి నాయకులను కలసి ప్రతిపక్ష కూటమికి కేంద్ర బిందువుగా మారుతున్నారు. 


కనండి.. కంటూనే ఉండండి..!

Posted 44 minutes ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted a day ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted a day ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 2 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 2 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 2 days ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 2 days ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted 2 days ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!