ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

నితీష్ నమ్మక ద్రోహి.... మోదీ, అమిత్ షా ల కుట్ర

Posted 4 months ago politics

బీహార్ ప్రజలను జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మోసం చేశారని ఆరోపిస్తూ నితీష్ కుమార్ ప్రజలకు దారుణంగా నమ్మక ద్రోహం చేశారని  ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేడీయూ - బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని  బీహార్ ప్రజలు తప్పుబడుతున్నారని అంటూ   ఇది ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కుట్ర అని స్పష్టం చేశారు. 

నితీశ్‌ బిహార్‌ ప్రజలకు మీ మొహం ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. కావాలనే తన  కుమారుడు తేజస్వీయాదవ్‌ను నిందితుడిగా చూపిస్తున్నారని అంటూ  2019 ఎన్నికల్లో తేజస్వీ ఎక్కడ బలమైన అభ్యర్థిగా మారతాడో అని భయపడి ఇలా చేశారని విమర్శించారు. చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ, నితీశ్‌ కలిసి లంచ్‌ చేశారని అంటూ  అప్పుడే తర్వాత ఏం చేయాలనే దాని గురించి నిర్ణయించుకున్నారని చెప్పారు. 

"నేను గత 15-20 సంవత్సరాల నుంచి పలు కేసుల విషయంలో న్యాయస్థానంలో పోరాడుతున్నాను. నేను శిక్ష కూడా అనుభవించాను. నితీశ్‌-భాజపా కలిసి చేసిన కుట్ర ఇది. నితీశ్‌ నుదుటిపై తిలకం దిద్ది సీఎంగా రాష్ట్రాన్ని పాలించు అని చెప్పాను. నా మనసులో దురాశ ఉంటే ఆయనను ఎందుకు సీఎంగా నామినేట్‌ చేస్తాను?" అని లాలూ ప్రసాద్‌ అన్నారు. సీఎం మమతా బెనర్జీ, అఖిలేశ్‌, మాయావతి.. అందరం ఒకటయ్యే సరికి నితీశ్‌ భాజపాతో చేతులు కలిపారని లాలూ ఆరోపించారు. 

Related Articles

Most Read