వచ్చే ఏడే లోక్ సభ ఎన్నికలు... బీజేపీ వ్యతిరేక కూటమికి మమతా పిలుపు

Posted 7 months ago | Category : politics

లోక్ సభ ఎన్నికలు గడువు కన్నా ముందుగా వచ్చే సంవత్సరం జరిగే అవకాశం ఉన్నదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ ఎన్నికలలో బీజేపీని ఓడించడం కోసం ప్రతిపక్షాలు అన్ని ఒక్కటి కావాలని ఆమె పిలుపిచ్చారు. బీజేపీ ని ఎదిరించే ఎవ్వరికైనా  బెంగాల్ మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అన్ని కలిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీను ఓడించవచ్చని ఆమె చెప్పారు.

బీజేపీని ఎవ్వరు వ్యతిరేకిస్తారో వారితో తాముంటామని అంటూ వచ్చే లోక్ సభ ఎన్నికల ముందు మహా కూటమిని ఏర్పాటు చేసి `పెద్దన్న' (బీజేపీ) ని అధికారం నుండి తొలగించాలని మృతవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కలకత్తాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మమతా కోరారు.

"2019 లోక్ సభ తమ (బీజేపీ) జేబులో ఉన్నదనుకొనే వారు పొరపాటు పడుతున్నారు. వారి జేబుకు పెద్ద చీలిక ఉంది. మోడీకి 30 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. బీజేపీని అధికారం నుండి తొలగించడాన్ని ఒక సవాల్ గా స్వీకరిస్తాము" అని ఆమె  ప్రకటించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో 18 పార్టీలు కలసి వచ్చాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మరో రెండు పార్టీలు చేరాయి. ఈ అవగాహనను ముందుకు తీసుకెళ్లాలి అని ఆమె కోరారు. ప్రస్తుత బీజేపీకి నాయకత్వంలోని కేంద్ర ప్రభుతాన్ని వ్యతిరేకించడంతో ప్రతిపక్షాలలో తృణమూల్ కాంగ్రెస్ ది బలమైన స్వరం అని ఆమె స్పష్టం చేశారు.

ఆగస్ట్ 9 నుండి 30 వరకు  "బీజేపీకి భారత్ చోరో" కార్యక్రమం బెంగాల్ లో చేబడుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ప్రదర్శనలు, బహిరంగ సభల ద్వారా రాష్ట్ర అంతటా బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తారని చెప్పారు. రాష్ట్రంలోనే కాకుండా దేశం అంతా మాత విద్వేషాలు రెచ్చగొట్టడానికి బాధ్యులైన బీజేపీ నిజ స్వరూపం ప్రజలకు వివరించడానికి విస్తృతంగా కార్యక్రమాలు  చేబడుతున్నట్లు తెలిపారు. 


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 2 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 2 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 2 days ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 2 days ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 2 days ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!