రేవంత్ రాజీనామా పై రమణ కొత్త ట్విస్ట్

Posted 3 months ago | Category : politics

తెలంగాణలో టీడీపీ కీలకనేత రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

టీడీపీ జాతీయాధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు రాజీనామా లేఖ ఇచ్చానని రేవంత్ చెప్పారు. సమావేశం ముగిసిన తర్వాత మాట్లాడదామని రేవంత్ కు చెప్పినా వెళ్లిపోయారని చంద్రబాబు ప్రకటించారు. ఈ హైడ్రామా రాజీనామా ఎపిసోడ్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ ట్విస్ట్ ఇచ్చారు. అసలు రేవంత్ రాజీనామానే చేయలేదని రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజీనామా సమర్పించినట్లు రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని, చంద్రబాబు నాయుడుకు రేవంత్ రాజీనామా లేఖ ఇచ్చిన మాట అవాస్తవమని, ఆ రోజు రేవంత్ కేవలం చంద్రబాబును కలవడానికి వచ్చారని ఆయనతో మాట్లాడి దండం పెట్టి వెళ్లిపోయారని రమణ తెలిపారు. ఆ లేఖ ఎవరికి ఇచ్చాడో తెలియదని చంద్రబాబుకు ఇచ్చానని ప్రచారం చేయడం సరికాదని చెప్పారు.

రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో మంచి నాయకుడిగా ఎదిగాడని ఇపుడు పార్టీ మారి నాయకుడి స్థాయి నుంచి కార్యకర్త స్థాయికి పడిపోయారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రేవంత్ తాను కాంగ్రెస్ లో కార్యకర్తనని చెప్పుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసే సమయంలో రేవంత్ రెడ్డి ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని రమణ మండిపడ్డారు. ఇటువంటి రేవంత్ లు ఎంతమంది వెళ్లినా టీడీపీ కేడర్ చెక్కు చెదరలేదన్నారు. ప్రస్తుతం పాలమూరులో ఎర్ర శేఖర్ అధ్యక్షతన టీడీపీ బలంగా ఉందన్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం టీడీపీనే అన్నారు. త్వరలో కొడంగల్ లో భారీ సభను ఏర్పాటు చేస్తామని రమణ ప్రకటించారు.


రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 16 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

Posted a day ago | Category : politics

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు