తెలుగుదేశానికి మరో షాక్ !

Posted 2 months ago | Category : politics

తెలంగాణా తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పుడు ఆయన్ని కొంతమంది తెలుగుదేశం నేతలు అనుసరిస్తారని అంతా భావించారు, వారిలో దివంగత హోంమంత్రి భార్య ఉమా మాధవ రెడ్డి కూడా ఉన్నారు.

అయితే అనూహ్యంగా ఆమె ఎటూ పక్కకి చూడకుండా తెలుగుదేశం లోనే ఉన్నారు. అయతే ఈరోజు జరిగిన కొని సంఘటనలు ఆమె తెరాస వైపు చూస్తున్నారా అనే అనుమానం కలిగిస్తున్నాయి. వివరాల లోకి వెళితే ఉమా మాధవరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీలో కలిశారు. నక్సలైట్ల చేతిలో మరణించిన నేతలకు ఇచ్చే ఇంటిస్థలంకు సంబంధించి సీఎంకు వినతిపత్రం ఇచ్చారు.

అనంతరం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి హామీ లేకుండానే కాంగ్రెస్ లో చేరడానికి తానేమన్నా పిచ్చిదాన్నా? అని అన్నారు. హామీ ఇచ్చి ఉంటే రేవంత్ రెడ్డితో పాటే ఢిల్లీ విమానం ఎక్కి ఉండేదాన్నని చెప్పారు. రేవంత్ కు పదవిపై కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చి ఉండవచ్చని తెలిపారు.

టీఆర్ఎస్ లోకి రావాలంటూ తనకు గత ఎన్నికల సమయంలోనే ఆహ్వానం వచ్చిందని, అయితే అప్పుడు తాను పార్టీ మారలేదని ఉమా మాధవరెడ్డి చెప్పారు. ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ లోకి రావాలంటూ తనను ఎవరూ అడగడం లేదని... ఒకవేళ అడిగితే అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు. ఏ పార్టీలో అయినా తన కుమారుడి వెంటే ఉంటానని అన్నారు. ఒంటరిగా కేసీఆర్ ను కలిస్తే టీఆర్ఎస్ లో చేరుతున్నాననే ప్రచారం జరుగుతుందని... అందుకే సండ్ర వెంకటవీరయ్యతో కలసి వెళ్లానని, అందరూ చూస్తుండగానే ఆయనకు వినతిపత్రం అందించానని చెప్పారు.

ఈ వ్యాఖ్యలని బట్టి చూస్తే ఆమె కార్ ఎక్కడానికి రెడీ అనే సంకేతాలు ఇస్తున్నట్టే కనిపిస్తోంది. అదే జరిగితే ఇప్పటికే షాక్ ల మీద షాక్ లు తగిలి అంపశయ్య మీద ఉన్న తెలుగుదేశానికి మరో ఎదురు దెబ్బ ఖాయంగా కనిపిస్తోంది.


పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

Posted 3 hours ago | Category : politics

పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

నెల్లూరులో జగన్...

Posted 3 hours ago | Category : politics

నెల్లూరులో జగన్...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 19 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 20 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted a day ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted a day ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted 2 days ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 2 days ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ