ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

మరోసారి నోట్లు రద్దా....?

Posted 5 days ago national

2016 నవంబర్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నోట్ల రద్దు తాలుకూ విపరిణామాల నుంచి ఇంకా తేరుకోకముందే.... మరో షాక్ ఖాయమని చెప్తున్నారు. మరోసారి నోట్ల రద్దు అయ్యే అవకాశం ఉందంటుంది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టు తాజాగా చేసిన సూచనలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి.

రూ. 50 - రూ. 200 నోట్లను ఇటీవలే ఆర్బీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు దాఖలైంది. ఈ నోట్లు వర్ణ వ్యంధత్వం ఉన్నవారు గుర్తించేలా లేవనేది పిటిషనర్ల వాదన. ఈ వాదనతో ఏకీభవించిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ - జస్టిస్ హరి శంకర్ లతో కూడిన ధర్మాసనం ఈ నోట్లను మార్చాలని సూచించింది.

నోట్ల సైజు - గుర్తింపు చిహ్నాలను మార్చాలని ఏ మాత్రం అవకాశమున్నా వీటి రంగు మరింత కనిపించేలా మార్పు చేయాలని కేంద్రానికి - రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ సందర్భంగా ఆర్ బీఐపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాము చేసిన సూచనలు అత్యంత ప్రాథమికమైనవని పేర్కొంటూ వాటిని ముందుగానే గమనించడంలో ఆర్బీఐ నిర్లక్ష్యం ఉందని స్పష్టం చేసింది.

కరెన్సీ ఎంత సైజులో ఉండాలన్న విషయాన్ని గతంలో కేంద్రం నిర్ణయించేదన్న విషయాన్ని గుర్తు చేసిన డిల్లీ హైకోర్టు - ఇప్పుడలా ఎందుకు చేయడం లేదని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సిలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ ను ప్రశ్నించింది. ప్రజల ప్రయోజనార్థం తమ సూచనల అమలుకు ప్రయత్నించాలని కోరింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేస్తూ ఈలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

Related Articles

Most Read