సకలసౌకర్యాలతో ట్రూకాలర్‌

Posted a year ago | Category : world business

ఇప్పటివరకు మీ మొబైల్ లో ఎవరు కాల్ చేసారో మాత్రమే తెలుపుతున్న ట్రూకాలర్‌..ఇప్పుడు కొత్త హంగులతో వచ్చింది. బ్యాంకింగ్‌ సేవలు, మొబైల్‌ రీఛార్జ్‌, వీడియో కాల్స్‌... లాంటి కొత్త కొత్త ఆప్షన్లతో ట్రూకాలర్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు.

ప్రముఖ కమ్యూనికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌తో చేతులు కలిపింది. వీడియో కాలింగ్‌ సదుపాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ రెండు సంస్థలు కలిశాయి. గూగుల్‌ డ్యుయో సహాయంతో త్వరలో ట్రూకాలర్‌ ద్వారా వీడియో సదుపాయం అందుబాటులోకి రానుంది. గూగుల్‌లాంటి భాగస్వామితో వినియోగదారులకు మొబైల్‌ కమ్యూనికేషన్స్‌, ఇతర సేవలను ఒకే పరిధిలోకి తీసుకురానున్నట్లు ట్రూకాలర్‌ సహ వ్యవస్థాపకులు, సీఎస్‌వో నామి జర్రింగలమ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. గూగుల్‌ డ్యుయోతో అనుసంధానమైన ట్రూకాలర్‌ మరికొన్ని నెలల్లో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ట్రూకాలర్‌తో అనుసంధానంతో వీడియో కాలింగ్‌ ఫీచర్‌ మరింత మెరుగుపడుతుందని, లక్షలాది వినియోగదారులకు వీడియో కాలింగ్‌లో మంచి అనుభవం కలుగుతుందని గూగుల్‌ డ్యుయో హెడ్‌ అమిత్‌ ఫులే తెలిపారు.

అంతర్జాలం లేనివాళ్లకు ఉపయుక్తంగా ఉండేలా ఎయిర్‌టెల్‌తో కలసి ట్రూకాలర్‌ కొత్తగా ‘ఎయిర్‌టెల్‌ ట్రూకాలర్‌ ఐడీ’ ఆప్షన్‌ను తీసుకొస్తోంది. మీకు ఎయిర్‌టెల్‌ నెంబరు నుంచి కాల్‌ వస్తే అప్పుడు నెట్‌ వినియోగించక¹పోయినా ఆ వ్యక్తి వివరాలు ట్రూకాలర్‌ ఆప్‌లో కనిపిస్తాయి.

ట్రూకాలర్‌ ఆప్‌ నుంచి డబ్బులు పంపించుకోవచ్చు, అందుకోవచ్చు. ట్రూకాలర్‌ పే పేరుతో ఓ సర్వీసును ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి ఈ ఆప్షన్‌ను ప్రారంభించింది. ఆప్‌లోని ఈ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే ఓ యూపీఐ ఐడీ క్రియేట్‌ అవుతుంది. దీని ద్వారా ఏదైనా యూపీఐ ఐడీ, భీమ్‌ ఆప్‌తో అనుసంధానమై ఉన్న మొబైల్‌ నంబరుకు డబ్బులు పంపించుకోవచ్చు. అంతేకాదు ఈ ఆప్‌ ద్వారా మొబైల్‌ రీఛార్జిలూ చేసుకోవచ్చు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 4 days ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!