//single page style gallary page

చంద్రబాబు ప్రభుత్వానికి కొత్త కష్టాలు...ఇలా అయితే 2019 కష్టమే.

Posted a year ago | Category : state politics

ఏపీ ప్ర‌భుత్వానికి, అధినేత చంద్ర‌బాబుకు కొత్త క‌ష్టాలు వ‌చ్చిప‌డుతున్నాయి. పాల‌నాప‌రంగా మెరుగైన స్థితిలో ఉన్నామ‌ని సంతోషించేలోగా పార్టీలో కుమ్ములాట‌లు, క‌ల‌హాలు క‌ల‌త‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. ప్రతిపక్షం పైచేయి సాధిస్తోంది. ఒక‌ప్పుడు వ‌ల‌స‌ల‌తో పార్టీని తిరుగులేని శ‌క్తిగా మ‌లుచుకుందామ‌ని టీడీపీ నేతలు భావించారు. కానీ అదే ఇప్పుడు రివ‌ర్స్ అయి పార్టీ ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. అధినేత వెంట‌నే ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. లేదంటే ఇది మ‌రింత రెచ్చి 2019లో పార్టీనే ఓడిస్తుందన్న అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది.

తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు పార్టీలో సీనియ‌ర్ల‌కు ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ప్రతిపక్షానికి బలం ఇస్తున్నాయి. భూమా నాగిరెడ్డి పార్టీలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌ర్నూలు జిల్లాలో టీడీపీకి బ‌లం పెరిగింది. శిల్పా, భూమా కుటుంబాల మ‌ధ్య రాజీ ప్ర‌య‌త్నాలు చేశారు. భూమా మ‌ర‌ణంతో మ‌ళ్లీ ఆధిప‌త్య రాజ‌కీయాలు బలహీనతగా మారాయి. ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ వ‌స్తే టికెట్ విష‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు పార్టీకి త‌ల‌పొటుగా మారింది. ఎవ‌రికి వారు ప‌ట్టుబ‌డుతుండ‌డంతో ఎటూ తేల్చ‌లేకపోతున్నారు. తండ్రి సెంటిమెంట్‌ అటు శిల్పాను కాదంటే ఓడిపోతామ‌న్న భ‌యం వెంటాడుతున్నాయి.

క‌డప జిల్లాలో ఆదినారాయ‌ణ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంపై రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గంలో ఆగ్ర‌హం నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినా శాంతించే ప‌రిస్థితి లేదు. అనుచ‌రులు స‌సేమిరా అంటున్నారు. మూడు ద‌శాబ్ధాలు ఎవ‌రితో ఫైట్ చేశారో వారిని పార్టీలోకి తీసుకొచ్చి మంత్రి ప‌ద‌వి ఇస్తే ఉండే క‌ష్టం వారి మాట‌ల్లో బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణ రెడ్డిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇస్తే ఆయ‌న‌పై సిబిఐ కేసులు చుట్టుకున్నాయి. ప్ర‌మాణ స్వీకారం కాక‌ముందే పార్టీ నుంచి తొల‌గించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. గంటా, సుజ‌నాల‌ను కూడా టార్గెట్ చేయ‌డానికి ఆయ‌న విప‌క్షానికి అస్త్రంగా మారారు.

ఇక ప్ర‌కాశం జిల్లాలో గొట్టిపాటి, క‌ర‌ణం కుటుంబాల మ‌ధ్య ఆధిపత్యయుద్ధం హ‌త్య‌ల‌కు దారి తీసింది. మొత్తం ముగ్గురు ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఈ లోపు రెండు వర్గాలు కొట్టుకున్నాయి. చొక్కాలు చించుకునేంత వరకు గొడవలువెళ్లాయి. ఈ సంఘట‌న‌తో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్ర‌తిష్ట మంట‌గ‌లిసింది. హ‌త్యా రాజ‌కీయాలు పడగవిప్పడం చంద్ర‌బాబుకు ఇబ్బందిగా మారింది. ఇది మరవకముందే క‌ర్నూలు జిల్లాలో వైసీపీ నాయ‌కుడు పత్తికొండ ఇన్ ఛార్జ్ నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య రాష్ట్ర రాజ‌కీయాల‌ను వేడెక్కించింది. చంద్ర‌బాబు అవినీతి, అక్ర‌మాలు, హ‌త్యా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటారో అవే ఆయ‌న ప్ర‌భుత్వాన్ని వెంటాడుతున్నాయి. నాడు వ‌ల‌స‌ల‌తో బ‌ల‌ప‌డదామ‌ని భావించారు. అవే ఇప్పుడు బ‌ల‌హీన‌తలుగా మారాయి. మ‌రి ఈ గండం నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారా? లేదంటే ప్రతిపక్షాలకు బలం ఇచ్చినట్టే అవుతుంది.


నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 19 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

THAT IS ద్వారక తిరుమలరావు .....!

Posted 21 hours ago | Category : state national

THAT  IS  ద్వారక తిరుమలరావు .....!

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 21 hours ago | Category : politics

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Posted a day ago | Category : politics

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని  కాంగ్రెస్ నేతల హెచ్చరిక

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

Posted a day ago | Category : politics

ఖమ్మంలో నయా రాజకీయం...  దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

Posted a day ago | Category : politics

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13  మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted a day ago | Category : politics

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

Posted a day ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి..  ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

Posted a day ago | Category : politics

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

Posted a day ago | Category : politics

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం