//single page style gallary page

మేనల్లుడికి ఉద్వాసన.. కుమారుడికి పట్టం

Posted a year ago | Category : world

ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న సౌదీ అరేబియా రాజు సల్మాన్ తన కుమారుడు మహ్మ ద్ బిన్ సల్మాన్ (31)ను యువరాజుగా ప్రకటించారు. అంతకుముందు యువరాజుగా ఉన్న హోమ్ మంత్రి అయిన తన మేనలుడిని ఆ పదవి నుంచి తొలగించి సర్వాధికారాలను తన కుమారునికి కట్టబెట్టారు. ఈ మేరకు  రాజశాసనాన్ని విడుదల చేశారు.

అమెరికాకు అనుకూలంగా వ్యవహరించే నయీఫ్‌ను పదవి నుండి మాత్రమే కాక వారసత్వ జాబితా నుండి కూడా తప్పించిన రాజు నిర్ణయం రాజకీయంగా సంచలనం కలిగించింది. కతార్‌ను ఏకాకిని చేసేందుకు ఇటీవల సౌదీ, ఎమిరేట్స్‌ చేసిన ప్రయత్నాలలో నయీఫ్‌ కీలక పాత్ర పోషించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తటంతో రాజు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తన నిర్ణయానికి సౌదీ ప్రజలంతా విధేయత ప్రకటించాలని రాజు సల్మాన్ కోరారు. యువరాజుగా నియమితుడైన మహమ్మద్ బిన్ సల్మాన్ ఉపప్రధానమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. రక్షణ, చమురు, ఆర్థికవ్యవహారాలు తదితర శాఖలు ఆయన ఆధ్వర్యంలో ఉంటాయి. 

యువకుడైన యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగే అవకాశం ఉంది. అల్ సౌద్ కుటుంబానికి చెందిన 34 మంది సీనియర్ సభ్యుల్లో 31 మంది రాజు సల్మాన్ నిర్ణయానికి మద్దతు పలికారని రాజశాసనం వెల్లడించింది. ఈ మేరకు మాజీ యువరాజు మహమ్మద్ అల్ నాయెఫ్ నూతన యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రమాణం చేయించారు. 

ఈ సందర్భంగా సల్మాన్ నాయెఫ్ చేతిని ముద్దాడారు. ఖతార్, ఇరాన్‌లతో వివాదాలు తీవ్రస్థాయికి చేరడంతోపాటు యెమన్‌లో యుద్ధం కొనసాగుతుండగా రాజు యువరాజుగా తన కుమారున్ని ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది.


అమ్మాయిలూ తాగకండి..

Posted 8 days ago | Category : health world

అమ్మాయిలూ తాగకండి..

అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

Posted 11 days ago | Category : world business

అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

వాజ్ పేయి కి తీవ్ర అస్వస్థత

Posted 11 days ago | Category : world national

వాజ్ పేయి కి తీవ్ర అస్వస్థత

వెళ్తున్న విమానంలోనే సెక్స్...ఛి

Posted 12 days ago | Category : world

వెళ్తున్న విమానంలోనే సెక్స్...ఛి

గర్భవతి అయి కూడా పాడు పని చేసింది

Posted 12 days ago | Category : world

గర్భవతి అయి కూడా పాడు పని చేసింది

భార్యని ఆఫ్రికా వ్యక్తితో శృంగారం చేయించేవాడు

Posted 16 days ago | Category : world sports

భార్యని ఆఫ్రికా వ్యక్తితో శృంగారం చేయించేవాడు

పాకిస్తాన్ ఎన్నికల్లో పోటి చేస్తున్న స్టార్ హీరో సోదరి

Posted 16 days ago | Category : national movies world

పాకిస్తాన్ ఎన్నికల్లో పోటి చేస్తున్న స్టార్ హీరో సోదరి

ఎన్నారైలకు షాకింగ్ ఆదేశాలు

Posted 16 days ago | Category : national world

ఎన్నారైలకు షాకింగ్ ఆదేశాలు

హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ తింటే...

Posted 22 days ago | Category : world national

హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ తింటే...

ట్రంప్ మరో సంచలన నిర్ణయం

Posted a month ago | Category : world

ట్రంప్ మరో సంచలన నిర్ణయం

జనాల జేబులు కాళి చేసిన వాట్సాప్

Posted a month ago | Category : state national world

జనాల జేబులు కాళి చేసిన వాట్సాప్