ఈ వారంలోనే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్హ్ది ప్రకటన !

Posted 8 months ago | Category : politics

రాష్ట్రపతి ఎన్నికల పక్రియ ప్రారంభం కారడంతో ఎన్డీయే అభ్యర్థిని ఖరారు చేసే కసరత్తును బిజెపి ముమ్మరం చేసింది. నామినేషన్లు దాఖలు చేయడానికి జులై 1 వరకు గడువు ఉన్నప్పటికీ ఈ వారంలోనే ఎప్పుడైనా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 

ఓటర్లలో 49 శాతం ఉండడంతో తమ అభ్యర్థిని సునాయానంగా గెలిపించుకోగల అవకాశం ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు `ఏకాభిప్రాయం' ద్వారా ఎన్నిక జరిగేటట్లు చేయడం కోసం బిజెపి నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నది. అందుకనే ప్రతిపక్షాలకు సహితం ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేసే కృషి చేస్తున్నారు. 

ముందుగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో సమాలోచనలు జరిపిన తరువాత, ఈ విషయమై ప్రధాన ప్రతిపక్షాలను సంప్రదించే అవకాశం ఉంది. సోమవారం నుండి అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటన జరపవలసిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తన పర్యటనను రద్దుచేసుకొని, రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో సంప్రదింపుల కోసం ఢిల్లీకే పరిమితం అవుతున్నారు. 

ఈ విషయమై ప్రతిపక్షాలు సహితం పోటీకి ఒక అభ్యర్థిని ఉమ్మడిగా నిలబెట్టాలని సమాలోచనలు జరుపుతున్నా ఒక అభిప్రాయానికి రాలేక పోతున్నాయి. ముందుగా బిజెపి తన అభ్యర్థి పేరును ప్రకటించే వరకు వేచి ఉండాలని, బిజెపి `హింధుత్వ' అభ్యర్థిని ఎంపిక చేస్తేనే నిలబెట్టాలని అనుకొంటున్నట్లు ఇప్పటికే సంకేతం ఇచ్చాయి. 

బిజెపి అభ్యర్థులుగా పలువురి పేరులు తెరపైకి వచ్చినా అధికారికంగా ఏ అభ్యర్థి విషయమై ఇప్పటి వరకు సంకేతం ఇవ్వలేదు. కేవలం రాష్ట్రపతిగా తమ అభ్యర్థిని గెలిపించు కోవడమే కాకుండా, నామమాత్రపు పోటీ పెట్టె సాకుతో ప్రతిపక్షాలు ఒక తాటిపైకి వచ్చి, 2019 ఎన్నికల నాటికి బిజెపి - వ్యతిరేక కూటమి ఏర్పాటుకు అంకురార్పణ జరిపే అవకాశం ఇవ్వరాదని కూడా బిజెపి భావిస్తున్నది. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా జులై 15 నుండి విశాఖపట్నంలో జరుపదలచిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను సహితం బిజెపి వాయిదా వేసింది. 


దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!