నిసార్ కోసం కలిసి పనిచేయబోతున్న నాసా, ఇస్రో

Posted 8 months ago | Category : world technology

అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ నాసా మరియు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలు కలిసి సంయుక్తంగా ఓ భారీ ప్రాజెక్టును చేప‌ట్టాయి. భూఉపగ్రహాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు నిసార్ అనే ఉప‌గ్ర‌హాన్నిఅభివృద్ధి చేస్తూ ఉన్నాయి. నిసార్ సింథ‌టిక్ అపార్చ‌ర్ రాడార్ శాటిలైట్ కోసం రెండు దేశాలు సుమారు ఒక‌టిన్న‌ర బిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేస్తున్నాయి. ఈ శాటిలైట్ రూపొందించేందుకు ఇస్రో, నాసా శాస్త్ర‌వేత్త‌లు కంటిమీద కునుక లేకుండా ప‌నిచేస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని రెండు ఫ్రీక్వెన్సీ (ఎల్ & ఎస్ బ్యాండ్)లు ఉన్న రాడార్ గా అభివృద్ధి చేయనున్నారు. ఎల్ బ్యాండ్ లో 24 సెంటీమీట‌ర్ల రాడార్, ఎస్ బ్యాండ్‌లో 13 సెంటీమీట‌ర్ల రాడార్ ఉంటుంది. ఎస్ బ్యాండ్‌ను ఇస్రో, ఎల్ బ్యాండ్‌ను నాసా అభివృద్ధి చేస్తున్నాయి. నిసార్ శాటిలైట్‌ను 2021వ సంవ‌త్స‌రంలో నింగిలోకి జీఎస్ఎల్వీ ద్వారా దీన్ని ప్రయోగించాలని భావిస్తున్నారు. ఈ ఉప‌గ్ర‌హ నిర్మాణం వ‌ల్ల అమెరికా, భార‌త్ మ‌ధ్య అనుబంధం మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది. శాటిలైట్‌లో ఉన్న రాడార్ల‌తో ప్ర‌తి వారం భూమి ఫోటోల‌ను తీయ‌నున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. వాటి వ‌ల్ల భూ ఫ‌ల‌కాల్లో ఏర్ప‌డుతున్న మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నించే అవ‌కాశాలున్న‌ట్లు చెబుతున్నారు. ఈ శాటిలైట్ అత్యంత ఖ‌రీదైన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్‌గా మారుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.


టచ్ ఫీచర్ తో IBall ల్యాప్టాప్ లాంచ్..!

Posted 15 hours ago | Category : technology

 టచ్ ఫీచర్ తో IBall ల్యాప్టాప్ లాంచ్..!

దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మీ నెంబర్ అవతలి వారికి కనిపించకుండా కాల్ చేయాలనుకుంటున్నారా ? అయితే ఇలా చేయండి...

Posted 3 days ago | Category : technology

మీ నెంబర్ అవతలి వారికి కనిపించకుండా కాల్ చేయాలనుకుంటున్నారా ? అయితే ఇలా చేయండి...

ఐడియా మ్యాజిక్ ఆఫర్ : రూ.3,300 క్యాష్ బ్యాక్ !

Posted 6 days ago | Category : technology

ఐడియా మ్యాజిక్ ఆఫర్ : రూ.3,300 క్యాష్ బ్యాక్ !

వాట్సాప్ ద్వారా డ‌బ్బు చెల్లింపులు..!

Posted 6 days ago | Category : technology

వాట్సాప్ ద్వారా డ‌బ్బు చెల్లింపులు..!

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్