ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ప్రధాని `దళిత్ కార్డ్'ను తిప్పికొట్టిన మాయావతి !

Posted 5 months ago politics

రాష్ట్రపతి ఎన్నికల్లో రామనాధ్ కోవింద్ ను నిలబెట్టడం ద్వారా తన ప్రభుత్వానికి  వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దళిత్ లను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రయోగించిన  `దళిత్ కార్డ్' ను తిప్పి కొట్టడం కోసమే బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజ్యసభ సభ్యతానికి రాజీనామా చేసిన్నట్లు తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్ లో దళిత్ లపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల గురించి మాట్లాడలేని రాజ్యసభ లో తాను ఉండలేనని అంటూ రాజీనామా చేయడం గమనార్హం.

సీబీఐ దాడుల ద్వారా ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడవేయడం ద్వారా తన ప్రభుత్వంపై దాడులు జరుపకుండా నిరోధించే ఎత్తుగడను ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్నారు. ఆ విధంగానే చిదంబరం, లాలూప్రసాద్ యాదవ్, మమతా బనెర్జీ, నవీన్ పట్నాయక్, మాయావతి వంటి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

వరుసగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లో తన పార్టీ ఘోరమైన పరాజయాలు చవిచూడడంతో పాటు 1990వ దశకం నుండి తనకు అండగా ఉంటున్న దళితులు ఈ మధ్య చేజారిపోతూ ఉండడంతో తిరిగి బలం పుంజుకోవడానికి మాయావతి ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారు. అటువంటి సమయంలో మాయావతి రాజ్యసభ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు.

ఇంకో వంక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్లమెంట్ కు తిరిగి వస్తానని సంకేతంఇస్తూ ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలతో చేతులు కలుపుతామని కూడా సంకేతం ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలతో ఆమె చేతులు కలిపారు. ఈ మూడు పార్టీలతో ఉత్తరప్రదేశ్ లో `మహా కూటమి' ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆమెను బీహార్ నుండి పార్లమెంట్ కు పంపుతామని ప్రకటన చేయడం గమనార్హం.

పార్లమెంట్ లో దళితుల గురించి తనను ప్రసంగించకుండా అడ్డుకున్నారని మాయావతి చేసిన ఆరోపణకు బీజేపీ తగు సమాధానం చెప్పలేక పోయింది. మాయావతి ఎదురు దాడితో బీజేపీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిందా ?

Related Articles

Most Read