భయంతో భారత్ పై అణుదాడికి వెనుకడుగు వేసిన ముషారఫ్

Posted 7 months ago | Category : world

పాకిస్థాన్ మాజీ సైనిక నియంత జ‌న‌ర‌ల్ ప‌ర్వేజ్ ముషార‌ఫ్‌ భారత్ పై అణుదాడికి సిద్ధపడి భారత్ నుండి ఎదురు కాగల ప్ర‌తీకార చ‌ర్య‌కు  భయపడి ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకున్న‌ట్లు  తెలుస్తున్నది. ఈ విషయాన్నీ స్వయంగా ముషార‌ఫ్ చెప్పిన్నట్లు  జ‌పాన్‌కు చెందిన ప‌త్రిక మైనిచి షింబున్ వెల్ల‌డించింది.

2001లో భార‌త్ పార్ల‌మెంట్‌పై దాడి త‌ర్వాత ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే భార‌త్‌పై అణ్వాయుధాల‌తో దాడి చేయాల‌నుకున్నాన‌ని ముషార‌ఫ్ చెప్పిన‌ట్లు ఆ ప‌త్రిక తెలిపింది. అంతేకాదు అణుదాడి చేయాలా వ‌ద్దా అన్న ఆలోచ‌న‌ల‌తో ఎన్నో నిద్ర‌లేని రాత్రుల‌ను గ‌డిపిన‌ట్లు కూడా అత‌ను చెప్పాడు. అణ్వాయుధాల వినియోగంపై అప్ప‌ట్లో ముషార‌ఫ్ బహిరంగంగానే వ్యాఖ్య‌లు చేశాడు.

అయితే ఆ స‌మ‌యంలో భారత్ గానీ, పాకిస్థాన్‌గానీ త‌మ మిస్సైల్స్‌పై న్యూక్లియ‌ర్ వార్‌హెడ్స్‌ను లోడ్ చేసి ఉంచ‌లేద‌ని కూడా ముషార‌ఫ్ చెప్పాడు. న్యూక్లియ‌ర్ వార్‌హెడ్స్‌ను లోడ్ చేసి మిస్సైల్స్‌ను సిద్ధంగా ఉంచాల‌ని ఆదేశించారా అని ప్ర‌శ్నించ‌గా భారత్ నుంచి ప్ర‌తి దాడుల‌కు భ‌య‌ప‌డి అస‌లు ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకున్న‌ట్లు అంగీకరించాడు.

ఆ త‌ర్వాత రెండు దేశాలు యుద్ధం ఆలోచ‌న‌ను విర‌మించి ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకున్నాయి. 1999లో ప్రధాని నవాజ్ ష‌రీఫ్‌ను గ‌ద్దె దించి పాక్ ప‌గ్గాల‌ను ముషార‌ఫ్ చేప‌ట్టాడు. 2001 నుంచి 2008 వ‌ర‌కు ముషార‌ఫ్ పాక్ అధ్య‌క్షుడిగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఏడాది కాలంగా అత‌ను దుబాయ్‌లో ఉంటున్నాడు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!