ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

మధ్యప్రదేశ్ రైతు ఆందోళన లక్ష్యం సియం శివరాజ్ సింగ్ చౌహన్ ?

Posted 6 months ago national politics

మధ్యప్రదేశ్ లో రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చడం వెనుక బీజేపీకి లోని అంతర్గత ఆధిపత్య పోరు ప్రధాన కారణంగా పలువురు భావిస్తున్నారు. పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉంటున్నా ప్రజలలో వ్యతిరేకత ఎదుర్కొనని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను అస్థిర పరచడం కోసమే బీజేపీ లోని ఉన్నతస్థాయి వర్గాలు ఈ ఆందోళనను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన్నట్లు తెలుస్తున్నది. 

వాస్తవానికి దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి రేటు చౌహన్ సాధించగలుగు తున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపొందితే చౌహన్ జాతీయ స్థాయిలోనే బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధిపత్యాన్ని ఎదిరించగల నాయకుడిగా తొలినుండి ఆయన గుర్తింపు పొందుతున్నారు.  ఈ సంవత్సరం చివరిలో గుజరాత్ అసెంబ్లీ కి జరిగే ఎన్నికలలో బీజేపీ ఓటమి చెందితే మోడీ మరింత బలహీనమయ్యే అవకాశం ఉంది. అటువంటప్పుడు చౌహన్ ను తెరమీదకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. 

ఈ సందర్భంగా మూడు రోజుల క్రితం జరిగిన పోలీస్ కాల్పులను పలువురు ప్రస్తావిస్తున్నారు. అసలు పోలీస్ లు కాల్పులు జరపని లేదని, ఎవ్వరో సంఘవిద్రోహ శక్తుల పని అంటూ రాష్త్ర హోమ్ మంత్రి 48 గంటల వరకు చెబుతూ వచ్చారు. అయితే గురువారం నాడు పోలీస్ లు `ఆత్మరక్షణ' కోసం కాల్పులు జరిపి ఉండవచ్చని ఆయన అంగీకరించారు. 

వాస్తవానికి పోలీస్ లు కాల్పులు జరుపలేదని, కేంద్ర రిజర్వు పోలీస్ లు (సి ఆర్ పి యఫ్) జరిపారని ఇప్పుడు తెలుస్తున్నది. మెజిస్టీరియల్ ఉత్తరువులు  లేకుండా, స్థానిక పోలీస్ ను సంప్రదించకుండా వారు నేరుగా కాల్పులు జరపడం పెను వివాదానికి దారితీస్తుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్నీ అప్రదిష్ట పాలు చేయడం కోసమే కాల్పులు జరిపారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

జూన్ 1 నుండి అంతగా పేరు తెలియని ఒక రైతు నాయకుడు ఆందోళనకు పిలుపు ఇస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే విధ్వంసానికి దారితీసే ఉద్యమకారుడిగా పేరున్న  రైతు నాయకుడు శివకుమార్ శర్మ మూడు రోజుల తరువాత రంగంలోకి దిగడంతోనే ఉద్యమం హింసాయుత రూపు తీసుకొంది. 

ఆర్ యస్ యస్ అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్ కు గతంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న శివ కుమార్ ను ఐదేళ్ల క్రితం ఇదేవిధంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రైతు ఉద్యమం చేపట్టడంతో సంస్థ నుండి బహిష్కరించారు. అప్పటి నుండి సొంత యూనియన్ ఏర్పరుచుకున్నారు. ఇప్పటి ఉద్యమం సెమి-ఫైనల్ మాత్రమే అని, క్వార్టర్ ఫైనల్ అక్టోబర్ లో జరుగుతోందని, ఫైనల్ వచ్చే జనవరిలో అని చెప్పడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో చౌహన్ ను ఓడించడమే లక్ష్యం అని ఆయన చెప్పకనే చెప్పిన్నట్లయింది. 

Related Articles

Most Read