మోడీ నుండి 10 కోట్ల మందికి యస్ యం యస్ లు, 2 కోట్ల మందికి ఉత్తరాలు

Posted 9 months ago | Category : national politics

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి మే 26న మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొంటున్నారు. తృతీయ వార్షికోత్సవాన్ని వినూత్న రీతిలో, కోట్లాది మంది ప్రజలకు నేరుగా మోడీ సందేశం అందే రీతిలో జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కోట్లాది మంది నేరుగా ప్రధాని నుండి ఉత్తరాలు, యస్ యం యస్ లు అందుకొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

వివిధ ప్రభుత్వ పధకాల ద్వారా  లబ్ది పొందిన రెండు కోట్లమందికి ఉత్తరాలను పంపడం కోసం ముద్రిస్తున్నారు. వీటిని ఉత్సవాలు ప్రారంభం కావడానికి ముందే ఈ నెల 20 నుండి పంపడం ప్రారంభం కావచ్చు. అదే సమయంలో 10 కోట్లమందికి యస్ యం యస్ లను పంపే ఏర్పాట్లు చేటున్నారు. ఆ విధంగా 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే `మోడీ బ్రాండ్' ను విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. 

జూన్ 15 వరకు జరిగే ఈ వార్షికోత్సవాలను మే 26న గౌహతి నుండి ప్రధాని బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా ప్రారంభిస్తారు. అదే రోజున అస్సాంలో ఏర్పడిన తొలి బిజెపి ప్రభుత్వం తొలి వార్షికోత్సవాన్ని కూడా జరుపుకొంటుంది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పధకాలను ప్రధాని ఆవిష్కరించే అవకాశం ఉంది. 

ఇక దేశ వ్యాప్తంగా `మోడీ ఫెస్ట్' లను పెద్ద ఎత్తున జరుపనున్నారు. మే 27న బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీ లో విలేఖరుల సమావేశం జరుపుతారు. ప్రతి మంత్రిత్వ శాఖ `అప్పుడు-ఇప్పడు' అంటూ గత మూడేళ్ళలో సాధించిన అభివృద్ధి గురించి పుస్తకాలను ప్రచురిస్తున్నది.

సుమారు 400 దిన పత్రికలలో ప్రభుత్వ విజయాల గురించి భారీ ప్రకటనలు ఇవ్వనున్నారు. 500 నగరాలలో `సబ్కా సాత్ సబ్కా వికాస్' కార్యక్రమాలు జరుపనున్నారు. దేశ వ్యపథంగా సుమారు 900 నగరాలలో "కొత్త భారత్" పేరుతో భారీ కార్యక్రమాలు చేపడుతున్నారు. అట్లాగే వివిధ రాష్ట్రాలలో 300 మల్టీ మీడియా ప్రదర్శనలు జరుపనున్నారు. 


కనండి.. కంటూనే ఉండండి..!

Posted 44 minutes ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted an hour ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted an hour ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted 4 hours ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted 8 hours ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్ కైలీ

Posted 11 hours ago | Category : national

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్  కైలీ

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Posted 21 hours ago | Category : national

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు