ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

పశువధ ఆంక్షలపై ఆత్మరక్షణలో మోడీ ప్రభుత్వం

Posted 6 months ago national politics

పశువధపై కేంద్రం విధించిన ఆంక్షలపై దేశ వ్యాప్తంగా నిరసన వెల్లువలా ఊపందుకొవడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ముఖ్యంగా ఉమ్మడి జాబితాలో ఉన్న ఈ అంశంపై కనీసం రాష్ట్రాలతో సంప్రదింపులు కూడా జరుపకుండా కేంద్రం ఏకపక్షంగా ఉత్తరువులు జారీ చేయడం ప్రతిపక్షాల నుండి విమర్శలు చెలరేగుతున్నాయి. 

ఈ నిర్ణయం దేశంలోని సమాఖ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిదని ఇప్పటికే కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు విమర్శించారు. ఆ రెండు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. న్యాయ పోరాటానికి సిద్దపడుతున్నారు. తమిళనాడు వంటి చోట్ల ప్రభుత్వాలు మౌనంగా ఉన్నా పెద్ద పెట్టున నిరసనలు జరుగుతున్నాయి. 

ప్రధాని మోడీ పట్ల సానుకూలంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వంటి ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో మౌనం దాల్చుతున్నాయి. ఈ నెల 31న తమిళనాడులో భారీఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాలని ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షపార్టీ డీఎంకే నిర్ణయించింది. 

ఐఐటీ మద్రాస్ విద్యార్థులు పశువంటకాల విందును ఏర్పాటుచేశారు.  కేరళలో అధికారపార్టీ సీపీఎం శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 ప్రాంతాల్లో పశువధ నిషేధాన్ని నిరసిస్తూ.. పశు వంటకాల విందు (బీఫ్ ఫెస్టివెల్)ను ఏర్పాటుచేశాయి.

పశుమాంసంపై నిషేధాన్ని బీజేపీ నేతలు సమర్థిస్తుంటే మేఘాలయలోని ఆ పార్టీ నాయకుడు బెర్నార్డ్ మరాక్ మాత్రం  తమను అధికారంలోకి తీసుకొస్తే తక్కువ రేటుకు పశుమాంసం లభించేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా గరోహిల్స్‌లో ప్రజలు పశుమాంసాన్ని తినటం సర్వసాధారణ విషయమని, అయితే, అధిక ధరలను తగ్గించటానికి ఒక నియంత్రణ వ్యవస్థ అవసరమని ఆయన తెలిపారు. 

ఈ నేపథ్యంలో ఈ విషయమై కేంద్రం పునరాలోచన చేయక తప్పడం లేదు. ఆందోళన చెందుతున్న వారిని సముదాయించడం కోసం నిషేధం నుంచి బర్రెలను మినహాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.  "కొత్త పశువధ నిబంధనల ప్రకారం వధించకూడని జంతువుల జాబితాలో చేర్చే జీవుల గురించే మాకు కొన్ని విజ్ఞాపనలు వచ్చాయి. దీనిపై కసరత్తు చేస్తున్నాము" అని కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి ఏఎన్ ఝా చెప్పారు. 

Related Articles

Most Read