ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఇందిరకు నిజమైన రాజకీయ వారసుడు మోడీ !

Posted 5 months ago politics

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ తొలినుండి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలలో మునిగి తేలిన వ్యక్తి. `కాంగ్రెస్ ముక్త భారత్' నినాదంతో ప్రధాని పదవిలోకి వచ్చి, దేశం అంతా కాంగ్రెస్ మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నారు. పైగా ఎమర్జెన్సీ లో ఇందిరా వ్యతిరేక పోరాటం నుండి ప్రజాజీవనంలోకి వచ్చినవారు. 

ఇందిరా గాంధీ మృతి చెంది 33 ఏళ్లయినా ఇంకా భారత ప్రజల స్మృతి నుండి ఆమె చెరిగిపోలేదు. స్వతంత్ర భారత్ లో తొలి మహిళా ప్రధానిగానే గాక  అత్యంత శక్తివంతమైన ప్రధానిగా కూడా  పేరొందారు. దేశానిగి ఘనమైన సైనిక విజయం బాంగ్లాదేశ్ ఆవిర్భావంతో ఆమె తీసుకువచ్చారు. ఆమె కుమారుడిగా రాజీవ్ గాంధీ ప్రధాని పదవిలో ఉన్నారు. ఇప్పుడు మనవడు  రాహుల్ గాంధీ ఆ  పదవి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందిరను గుర్తు తెచ్చే మరో మనవరాలు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కు మిగిలిన `బ్రహ్మాస్త్రం' గా పలువురు  భావిస్తున్నారు. 

అయితే ఇందిరా గాంధీకి నిజమైన రాజకీయ వారసుడు నరేంద్ర మోడీ అని అంటారు ప్రముఖ జర్నలిస్ట్ సాగరిక ఘోష్. ఇందిరాగాంధీ శతజయంతి సందర్భంగా "ఇందిరా గాంధీ :  అత్యంత శక్తివంతమైన ప్రధాన మంత్రి" అని వ్రాసిన పుస్తకంలో ఆమె ఈ విషయం పేర్కొన్నారు. అందుకు ఆమె పలు ఉదాహరణలు ఇచ్చారు. 

దేశంలో రాజకీయ వ్యవస్థలో మొదటిసారిగా `హై కమాండ్' వ్యవస్థను ప్రవేశ  పెట్టింది. ఇందిరాగాంధీ. పార్టీలో, ప్రభుత్వంలో ఆమె మాటకు ఎదురు ఉండదు. విధానాల ద్వారా కాకుండా ప్రజాకర్షణ ద్వారా మద్దతు కూడదీసుకోవడం చేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీ అదే విధంగా చేస్తున్నారు. 

పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి అసమ్మతిని సహించలేరు. మీడియా తో ప్రతికూల సంబంధాలు ఉంటాయి. పార్టీతో సంబంధం  లేకుండా ప్రజాకర్షణ పథకాలతో నేరుగా  ప్రజలకు చేరే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు నేతలు కీలకమైన స్వతంత్ర వ్యవస్థలను బలహీన పరచే ప్రయత్నం చేశారు.  ఓటు బ్యాంక్ రాజకీయాలపై ఆధార పడ్డారు. అందుకనే ఇందిరా, మోడీ వ్యవహార శైలి ఒకే విధంగా ఉన్నాయని సాగరిక ఘోష్ నిర్ధారణకు వచ్చారు. 

Related Articles

Most Read