అద్వానీకి భారత రత్నయోచనలో మోదీ ?

Posted 7 months ago | Category : politics

రాష్ట్రపతి పదవికి బీజేపీ అన్ని విధాలుగా అర్హతగల నాయకుడు మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ అని బీజేపీ వర్గాలు మాత్రమే కాకుండా దాదాపు అన్ని రాజకీయ పక్షాలు భావించాయి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆయనను వ్యూహాత్మకంగా రాష్ట్రపతి పదవికి పోటీ  నుండి తప్పించారు. అయోధ్య కేసును సీబీఐ ద్వారా తిరగ తోడించడం అందులో భాగమే అని అందరు భావిస్తున్నారు. 

అద్వానీని ప్రక్కకు త్రోసి 2013లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా తెరపైకి రావడం, అధికారంలోకి రాగానే అద్వానీకి  దాదాపు `రాజకీయ సన్యాసం' ప్రకటించిన్నట్లు 75 ఏళ్ళ పైబడిన వారిని అన్ని పదవులకు దూరంగా  ఉంచడం చేస్తూ వచ్చారు. రాష్ట్రపతి ఎన్నిక ద్వారా అద్వానీ రాజకీయ జీవితాన్ని `సమాధి'  చేసిన్నట్లు అయింది. 

2002లో  గుజరాత్ అల్లర్ల అనంతరం నాటి ప్రధాని  వాజపేయి పట్టుబట్టినా  మోదీని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా అడ్డుపడింది అద్వానీ మాత్రమే కావడం గమనార్హం. తన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన మలుపుకు దోహదపడిన అద్వానీ రాజకీయ జీవనాన్ని ధ్వంసం చేసిన అపవాదు పోగొట్టుకోవడం కోసం ఆయనకు దేశంలో  అత్యున్నత పౌర పురస్కారం  `భారత రత్న' ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. 

ముందుగా ఈ విషయమై పార్టీలో, ప్రభుత్వంలో ఏకాభిప్రాయం  సాధించేందుకు తగు మద్దతు సమీకరించే బాధ్యతలను మంత్రులు అరుణ్ జైట్లీ, రవి శంకర్ ప్రసాద్ లకు అప్పచెప్పారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే రిపబ్లిక్ డే నాటికే ఆయనకు `భారత రత్న' ను ప్రకటించే అవకాశం ఉంది. తద్వారా పార్టీలో అద్వానీ మద్దతుదారులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 


రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 13 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 4 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 4 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!