ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

టిడిపి-బిజెపి మధ్య అగ్గి రాజేస్తున్నమోడీ-జగన్ సమావేశం

Posted 7 months ago state politics

తాను దేశంలో లేని సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వై యస్ జగన్మోహన్ రెడ్డి కలసి రావడం పట్ల అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

అమెరికా నుండి రాగానే ఢిల్లీ లో ఆరేడు గంటలపాటు ఆయన ఎవ్వరికీ కనిపించకుండా, ఒక్కరే పలువురిని కలసిన్నట్లు వార్తలు రావడం ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. ఈ సమయంలో మోడీతో జగన్ సంమావేశంతో రాగాల `ప్రమాదాల నివారణ' కోసం ప్రముఖులతో కసరత్తు చేశారని తెలుస్తున్నది. 

ఒక ప్రతిపక్ష నేత ప్రధానిని కలసి, ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించడం సాధారణ అంశమే అయినా తెలుగు దేశం నేతలు ఇంతగా స్పందించడం మూడేళ్ళుగా భాగస్వామ్య పక్షాలుగా ఉంటున్న బిజెపి-టిడిపి ల మధ్య అగ్గి రాజేస్తున్నట్లయింది. బిజెపి కి సన్నిహితం కావాలని వై యస్ ఆర్ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని ఈ సందర్భంగా వస్తున్న కధనాలు వారిలో కలవరం కలిగిస్తున్నాయి.  

ఈ సందర్భంగా పలువురు తెలుగు దేశం పార్టీ నాయకులు చేసిన విమర్శల పట్ల బిజెపి రాష్ట్ర నాయకులు ధీటుగా స్పందించడం గమనిస్తే మోడీ-జగన్ సమావేశం రెండు పార్టీల మధ్య అపనమ్మకం రాజుకోవడానికి దారితీస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. 12 క్రిమినల్ కేసులలో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ప్రధాని కలవడం ఏమిటని ఒక యంయల్సీకి ప్రశ్నించడం బిజెపి నాయకులకు ఆగ్రహం కలిగిస్తున్నది. 

తాజాగా అవినీతిపరులందరిపై కేసులు బిగుసుకుంటున్నందున ఆయన(జగన్‌)కు ఏదైనా కలొచ్చిందా? ఏం వూహించుకుని, ఏం భయపడ్డారు? ప్రధానిని కలసి ఏం సాధించారో ప్రజలకు చెప్పాలంటూ చంద్రబాబునాయుడు ప్రశ్నించడం కేవలం కేసుల కోసమే జగన్ ప్రధానిని కలిసిన్నట్లు చెప్పిన్నట్లయింది. 

 ప్రధాని మోడీని కలిసిన జగన్‌ ఆయనతో ఏ అంశాలు చర్చించారో ప్రజలకైనా జవాబు చెప్పాలనడం ద్వారా వారిద్దరి మధ్య `రహస్య ఆవగాహన కుదిరనదనే అనుమానాన్ని చంద్రబాబు వ్యక్తం చేసిన్నట్లు అయింది. 

జగన్‌ను బూచిగా చూపించి ప్రధాని మోదీని, బీజేపీని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆరోపించారు. మోదీని జగన్‌ కలవడంపై తమ మిత్రపక్షం టీడీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని అంటూ ఆయన ధ్వజమెత్తారు

Most Read