ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ప్రశ్నలు అడిగితే మోడీకి కోపం వస్తుంది

Posted 3 months ago politics

పార్టీ ఎంపీల సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నలు వేయడాన్ని సహింపరు. ఎవ్వరైనా ఏ అంశంగా ప్రస్తావించినాకోపం తెచ్చుకొంటారు. రైతుల ఆత్మహత్యలు, ఓబిసి మంత్రిత్వ శాఖ వంటి అంశాలను పార్టీ ఎంపీల సమావేశాలలో లేవనెత్తితే `నోరు మూసుకో' అన్నారని మహారాష్ట్రకు చెందిన బిజెపి ఎంపీ నానా పాటోలే చెప్పారు.

నాగపూర్ లో వ్యవసాయంలో నెలకొన్న సంక్షోభం గురించి జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని తరచుగా ఎంపీలతో సమావేశాలు జరుపుతారు. కానీ ఉపయోగం ఏమిటి ? కనీసం సలహాలు ఇచ్చినా ఆయన కోపం తెచ్చుకొంటారు. "నేను గ్రీన్ టాక్స్, వ్యవసాయ రంగంలో కేంద్రం మరింతగా పెట్టుబడులు పెట్టాలి అంటూ కొన్ని సూచనలు చేయబోతుంటే కోపంగా చూసి కూర్చోమన్నారు" అని బంద్రా - గోండియా యంపీ వాపోయారు.

"నీవు పార్టీ మేనిఫెస్టో చదివితే, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ పధకాలు గురించి తెలుసుకొంటే ఇటువంటి ప్రశ్నలు వేయవు" అని కోపంగా విసుక్కొంటూ చెబుతారు. పార్టీ ఎంపీల మాటలను కూడా వినే  సహనం ప్రధానితో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గురించి మాట్లాడుతూ "కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు తెలీని అసమర్ధుడు. దేశ ఖజానాకు ఎక్కువ నిధులు ముంబై నుండి వస్తున్నా కేంద్రం నుండి రాష్ట్రానికి చాల తక్కువ నిధులు సమకూరుతున్నాయి. ప్రతి పార్లమెంట్ సమావేశాలు ముందు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఎంపీలతో సమావేశాలు జరపడం చేస్తుంటారు. కానీ ఫడ్నవిస్ అటువంటి సమావేశాలు జరపటమే లేదు" అని చెప్పారు.

"కేంద్ర మంత్రులు ఎప్పుడో భయం నీడలో ఉంటున్నారు. అందుకనే నేను మంత్రి పదవికోసం ఎదురు చూడటం లేదు. ఇప్పటికే నేను హిట్ లిస్ట్ లో ఉన్నాను. కానీ నేను లెక్క చేయను" అని స్పష్టం చేశారు.

Related Articles

Most Read