సుష్మా స్వరాజ్ అభ్యర్థిత్వం పట్ల మోడీ శిబిరంలో ఆందోళన !

Posted 8 months ago | Category : politics

రాష్త్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేటట్లు చేయడానికి ఏకాభిప్రాయం కోసం బీజేపీకి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ పదవికి విదేశాంగ శాఖ మంత్రి  సుష్మా స్వరాజ్ పేరు తెరపైకి రావడంతో ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహిత వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది. ఆమె రాష్ట్రపతి భవన్ లోకి ప్రవేశిస్తే బలమైన అధికార కేంద్రంగా మారి, 2019లో బీజేపీకి కి స్పష్టమైన ఆధిక్యత లభించలేని పక్షంలో కీలకంగా మారే అవకాశం ఉండటమే అందుకు ప్రధాన కారణం. 

రాజకీయాలకు అతీతంగా ఆమెకు పలు ప్రతిపక్షాల నుండి కూడా మద్దతు లభించే అవకాశం ఉన్నా, ప్రధానికి సన్నిహితులైన మంత్రులు, నాయకులు మాత్రం ఆమె అభ్యర్థిత్వం పట్ల సుముఖంగా లేరని తెలుస్తున్నది. 2013లో బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ రంగంలోకి వచ్చినపుడు చివరి వరకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, మాజీ ఉప ప్రధాని ఎల్ కె అడ్వాణీకి మద్దతుగా ఉన్నది ఆమె ఒక్కరే కావడం గమనార్హం. 

ఆమెను అసలు మంత్రివర్గంలోకి తీసుకోరాదని ప్రధాని భావించినా తీసుకోక తప్పలేదు. ప్రజలతో సంబంధం లేని విదేశాంగ శాఖను ఇచ్చారు. తానే ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు జరుపుతూ, కీలక విదేశాంగ విధానాల రూపకల్పనలో ఆమెకు పాత్ర లేకుండా చేస్తూ వచ్చారు. అయినా మొత్తం మంత్రివర్గంలో అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్న మంత్రిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో సంబంధాలను మెరుగు పరచడంలో ఆమె కీలక పాత్ర వహించారు.  ఆమె పట్ల వ్యతిరేకత లేకపోయినా ఆర్ యస్ యస్ కు సహితం ఆమె అంతగా ఇష్టురాలు మాత్రం కాదు. 

ఆమెకు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి నాయకుల మద్దతు కూడా లభించే  అవకాశం ఉంది. ఆమె భర్త సోషలిస్ట్ కావడంతో నితీష్ కుమార్, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు కూడా ఆమె అభ్యర్థిత్వం పట్ల సుముఖత వ్యక్తం చేస్తారు. మోడీ మంత్రి వర్గంలో ఏ పార్టీకి చెందన వారు ఎటువంటి సమస్యతో వెళ్లినా సానుకూలంగా స్పందించే ఏకైక మంత్రిగా ఆమె పేరు పొందారు. 

మూడు పర్యాయాలు యం ఎల్ ఏ గా, ఏడు సార్లు యంపీగా ఉన్న ఆమెకు  మించిన అర్హత అధ్యక్ష పదవికి బిజెపి లో మరెవ్వరికీ లేదని ప్రతిపక్షాలు సహితం అంగీకరిస్తున్నాయి. పార్టీలకు అతీతంగా ఆమెకు గల సంబంధాలు, స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోగల సామర్ధ్యం సహజంగానే ప్రధాని మోడీ కి అసహనం కలిగించే అంశాలని పలువురు భావిస్తున్నారు. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోలేని అభ్యర్థి కోసమే మోడీ చూస్తున్నట్లు వినికిడి. 


కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted a day ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted a day ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 2 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 2 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 2 days ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 2 days ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted 2 days ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!