మోది సంచలన వ్యాఖ్యలు...!

Posted 2 months ago | Category : politics

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును వ్యతిరేకించే వారందరూ ఎద్దుల బండిపై ప్రయాణం చేయాలని గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌-ముంబైల మధ్య జపాన్‌ సహకారంతో లక్షా పదివేల కోట్లతో నిర్మించతలపెట్టిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 

అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ప్రారంభించాలని భావించినా, అది సాధ్యం కాలేదని మోదీ అన్నారు. ఇప్పుడు జనతా ప్రభుత్వం ప్రాజెక్టు ప్రారంభించడంతో దాన్ని వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. అతి తక్కువ మొత్తానికి ప్రాజెక్టును తీసుకురావడంతో కాంగ్రెస్‌ ఓర్వలేకపోతోందని అన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ వల్ల గుజరాత్‌లో ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరుగుతాయని చెప్పారు. ప్రాజెక్టుకు వాడే ముడి సరుకు మొత్తాన్ని జపాన్‌ భారత్‌ నుంచే కొనుగోలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలోని పెద్దలకు గుజరాత్‌తో సంబంధాలు ఉన్నా.. రాష్ట్రానికి చేసిందని శూన్యమని చెప్పారు. కనీసం ఫెర్రీ సర్వీసులను కూడా కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేయలేకపోయిందని అన్నారు.

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వం వచ్చిన తర్వాత గుజరాత్‌లో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో రాష్ట్రం ఆనందమయంగా ఉందని గుర్తు చేశారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదిగా రికార్డు సృష్టించనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర పర్యాటక రంగం వృద్ధి సాధిస్తుందని అన్నారు.గుజరాత్‌ తీర రేఖ పొడవునా 1300 దీవులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని సింగపూర్‌ కంటే గొప్పగా తీర్చిదిద్దాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు వెల్లడించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను మోదీ కోరారు. 


పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

Posted 3 hours ago | Category : politics

పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

నెల్లూరులో జగన్...

Posted 3 hours ago | Category : politics

నెల్లూరులో జగన్...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 19 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 20 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted a day ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted a day ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted 2 days ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 2 days ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ