ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య వైఖ‌రి వ‌ల్లే సైబ‌ర్ దాడులన్న మైక్రోసాఫ్ట్

Posted 9 months ago | Category : world

ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య వైఖ‌రి వ‌ల్లే సైబ‌ర్ దాడులు పెరిగిన‌ట్లు మైక్రోసాఫ్ట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా 150 దేశాల్లో కంప్యూట‌ర్లపై జ‌రిగిన సైబ‌ర్ దాడి ప‌ట్ల స్పందిస్తూ  ప్ర‌స్తుతం జ‌రిగిన దాడులు ప్ర‌పంచ దేశాల ప్ర‌భుత్వాల‌కు మేలుకొల‌పు కావాల‌ని ఆ సంస్థ పేర్కొన్న‌ది. హానిక‌ర‌మైన లోపాలు పెరిగిపోతున్నా, ప్ర‌భుత్వాలు అలాగే త‌మ డేటాను స్టోర్ చేసుకుంటూ వెళ్లాయ‌ని, దాని వ‌ల్లే హ్యాక‌ర్లు విజృంభిస్తున్నార‌ని మైక్రోసాఫ్ట్ ఆరోపించింది.

 తాజాగా రాన్‌స‌మ్వేర్ వైర‌స్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాడులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే మైక్రోసాఫ్ట్ విండోస్‌లో లోపాలు ఉన్నాయ‌ని, అది తెలుసుకున్న హ్యాక‌ర్లు, అమెరికా ఇంటెలిజెన్స్ శాఖ నుంచి హ్యాకింగ్ టూల్స్‌ను త‌స్క‌రించార‌ని మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొన్న‌ది. సైబ‌ర్ దాడుల వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాల‌కు ప్ర‌భుత్వాలే కార‌ణ‌మ‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. 

అమెరికా ర‌క్ష‌ణ‌శాఖ‌కు చెందిన తోమాహాక్ మిస్సైళ్ల‌ను కూడా హ్యాక‌ర్లు దొంగ‌లించార‌ని సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ పేర్కొన్న‌ది. వ‌న్నా క్రిప్ట్ లేదా వ‌న్నా క్రై అని పిలిచే వైర‌ల్ సాఫ్ట్‌వేర్‌ను అమెరికాకు చెందిన జాతీయ భ‌ద్ర‌తా ఏజెన్సీ అభివృద్ధి చేసిన‌ట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొన్న‌ది. 

శుక్ర‌వారం లండ‌న్‌లో మొద‌లైన సైబ‌ర్ దాడి దాదాపు 150 దేశాల‌కు పాకింది. దాని వ‌ల్ల ఆయా దేశాల్లో సుమారు రెండు ల‌క్ష‌ల కంప్యూట‌ర్లు హ్యాక్ అయ్యాయి. గ‌త మార్చి నెల‌లోనే విండోస్ కంప్యూట‌ర్ల ర‌క్ష‌ణ కోసం సాఫ్ట్‌వేర్‌ను డెవ‌ల‌ప్ చేశామ‌ని, కానీ చాలావ‌ర‌కు కంప్యూట‌ర్ల‌కు ప్యాచ్ చేయ‌లేక‌పోయాయ‌న్నారు. 

ప్ర‌భుత్వ లోపాల వ‌ల్ల ఎటువంటి సైబ‌ర్ దాడులు జ‌రుగుతాయో తెలిసిన‌ట్లు మైక్రోసాఫ్ట్ అధ్య‌క్షుడు బ్రాడ్ స్మిత్ తెలిపారు. ప్ర‌భుత్వాల వ‌ద్ద ఉన్న డేటా లీక్ కావ‌డం వ‌ల్ల ధ్వంసం ఎక్కువ‌గా జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. 


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!