ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

మెట్రో రైల్ ఎక్కుదాం అనుకుంటున్నారా ? ఈ రూల్స్ చదవాల్సిందే ?

Posted 20 days ago state

మెట్రోరైల్ సేవలను వినియోగించుకునే ప్రయాణికులకు మార్గదర్శకాలను ఎల్ అండ్ టి మంగళవారం విడుదల చేసింది. ప్రయాణికులు స్లేషన్లలో విధిగా చేయాల్సిన, చేయకూడని పనుల జాబితాను ఇందులో పేర్కొంది.

ప్రయాణికులకు అత్యంత భద్రత, వసతులు కల్పించామని, ప్రయాణికులు వీటిని ఉపయోగించుకునే క్రమంలో మెట్రో నియమనిబంధనలను తెలుసుకొని, పాటించాలని ఎల్ అండ్ టి మెట్రోరైల్ సిఇఓ శివానంద్ నింబార్గి సూచించారు. ‘ నా నగరం -నా మెట్రో – నా గర్వం’ అనే విధంగా ప్రయాణికులు వ్యవహరించాలని అన్నారు.

పాటించాల్సిన నిబంధనలు :

1) వ్యర్థాలను పారవేసేందుకు డబ్బాలను ఉపయోగించాలి. మెట్రోరైల్ ప్రాంగణాలు శుభ్రంగా ఉండేలా సహకరించాలి.

2) మెట్రోరైల్ ప్రాంగణంలో ఉన్నప్పుడు అన్ని ప్రకటనలు జాగ్రత్తగా వినాలి.

3) మా కస్టమర్ సర్వీస్ బృందాన్ని లేదా మా స్టేషన్ సిబ్బందిని సంప్రదించడానికి ఏ మెట్రో స్టేషన్లలోనూ సంప్రదించవచ్చు.

4) ప్రయాణికుల భద్రతకు రాజీ ఉండదు. ప్రాణ, ఆస్తి నష్టం కలిగించే ఏ చర్య కనిపించినా సిబ్బందికి తెలపాలి.

5) భద్రత తనిఖీలలో స్టేషన్ సిబ్బందితో సహకరించాలి.

6) అన్ని సమయాల్లో సిబ్బంది, తోటి ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ఉండాలి.

7) బోర్డింగ్ ఎస్కలేటర్లు, పైకి ఎక్కేటప్పుడు ముందు చూడాలి.

8) గమ్యాన్ని చేరుకున్న తరువాత మెట్రోరైల్ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలి.

9) ఎస్కలేటర్‌ల ద్వారా వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

10) వృద్ధులు, మహిళలు, పిల్లలకు సహా యం చేయాలి.

11) వికలాంగులు చక్రాల కుర్చీలతో ఎలివేటర్ల ద్వారా చేరుకోవాలి.

12) టిక్కెట్ కౌటర్ల దగ్గర క్యూ పద్దతి పాటించాలి.

13) మెట్రోరైలు సిబ్బంది కోరినప్పుడు తనిఖీలో భాగంగా చెల్లుబాటు అయ్యే టోకెన్లను, స్మార్ట్ కార్డులను చూపించాలి.

14) అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే మెట్రో స్టేషన్‌ను వెంటనే వీడాలి.

పాటించకూడనివి :

1) మెట్రోరైలు ప్రాంగణంలో ఉమ్మడం, వ్యర్థాలు వేయడం, పోగాకు, పాన్ నమలడం నిషేధించారు.

2) మద్య పానాన్ని నిషేధించారు.

3) మెట్రోరైలు ప్రాంగణంలో ఫొటోలు తీయడం నిషేధం.

4) ప్రాంగణంలో సామాను వదిలివేయవద్దు.

5) రైలులో, ప్రాంగణంలో నేలపై చతురస్రంలో కూర్చొవద్దు.

6) ఆహారం, డ్రింక్స్ తీసుకుంటూ ప్రయాణం చేయవద్దు.

7) పెంపుడు జంతువులకు అనుమతి లేదు.

8) ప్రమాదకరమైన మండే వస్తువులను నిషేధించారు.

9) ఎస్కలేటర్లపై కుర్చొవద్దు.

10) రైలు కోసం వెచిఉన్నప్పుడు పసుపు గీత దాటొద్దు.

11) రైలు తలుపులు బలవంతంగా తెరవడం, ప్రయాణించేటప్పుడు వాటిపై వరగొద్దు.

12) రైలులోకి వెళ్లేటప్పుడు చప్పుడు చేయకుడదు.

13) పిల్లలను వంటరిగా వదలొద్దు.

14) అనుమతి లేకుండా తుపాకులు తీసురావద్దు.

15) ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన విషయాలనే డ్రైవర్‌కు తెలపాలి.

16) హాకర్స్ నిషేధం.

17) ఆటోమేటెడ్ తలుపులు మూసివేసేటప్పుడు రైలులో బోర్డ్, పైకి రావద్దు.

18) నోటీసులు అనుమతి లేకుండా పెట్టొద్దు.

19) భద్రతా పరికరాలు, మెట్రోరైళ్లను అడ్డుకోవద్దు.

20) స్మార్ట్ కార్డ్ లేదా టోకెన్‌ను తోటి ప్రయాణికులకు ఇవ్వొద్దు.

Most Read