ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తా

Posted 5 months ago politics

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు వాడివేడిగానే మొద‌ల‌య్యాయి. ద‌ళితుల‌పై దాడి అంశం రాజ్య‌స‌భ‌లో దుమారం లేపింది. త‌మ వ‌ర్గంపై దాడి జ‌రిగిన అంశాన్ని మాట్లాడ‌నివ్వ‌డం లేదంటూ బీఎస్పీ నేత మాయ‌వ‌తి ఉగ్రరూపం దాల్చారు త‌న‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కుంటే రాజీనామా చేస్తాన‌ని కూడా హెచ్చరించారు. 

ష‌హ‌రాన్‌పూర్‌లో ద‌ళితుల‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌ను ఆమె లేవ‌నెత్తారు.  ఉత్తరప్రదేశ్‌లో దళిత వర్గాలుపై జరుగుతోన్న దాడుల గురించి మాట్లాడేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ ఆమెకు డిప్యూటీ ఛైర్మన్‌ సమయం ఇవ్వలేదు. దీంతో కోపోద్రిక్తురాలైన మాయావతి ‘ఇప్పుడు మాట్లాడేందుకు నన్ను అనుమతించండి. లేదంటే రాజీనామా సమర్పిస్తా’ అని అన్నారు. 

యూపీలోని షహ్రాన్‌పూర్‌లో దళితులను లక్ష్యంగా చేసుకుని వరుసగా దాడులు చేపడుతున్నారని, సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తే తనకు మాట్లాడే అవకాశం కల్పించలేదని ఆమె తెలిపారు. 

రాజీనామా చేస్తాన‌ని చెబుతూ మాయావ‌తి త‌న చేతిలో ఉన్న కాగితాల‌ను నేల‌కు విసిరికొట్టి ఆగ్ర‌హాంగా స‌భ నుంచి వాకౌట్ చేశారు. ఆ సమయంలో లో మోదీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా స‌భ‌లో నినాదాలు వినిపించాయి. అన్ని స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం చ‌ర్చించాల‌ని ప్ర‌తిపక్ష నేత గులామ్ న‌బీ ఆజాద్ అన్నారు. న‌రికివేత‌, రైతుల మ‌ర‌ణాలు, ద‌ళితుల‌పై దాడులు లాంటి అంశాల‌ను స‌భ‌లో చ‌ర్చించాల‌ని డిమాండ్ చేశారు.

అనంతరం కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మాట్లాడుతూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీఎస్పీ ఓడిపోవ‌డం వ‌ల్లే మాయావ‌తి ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ద‌ని ఆరోపించారు. మాయావతి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సభలో అగౌరవంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఛైర్మన్‌కే సవాలు విసురుతారా అని ప్రశ్నించారు. 

సభలో మాయావతి ఎంతో కీలకమైన విషయాలను చర్చించేందుకు సిద్ధమయ్యారని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు. దళితులు, మైనార్టీలపై జరుగుతోన్న దాడుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ రెండు వర్గాలు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయని ఏచూరి అన్నారు.

సభ నుంచి బయటికి వచ్చిన అనంతరం మాయావతి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ రోజు రాజ్యసభలో బలహీన వర్గాల గురించి మాట్లాడేందుకు ప్రయత్నించాను. కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు?. అందుకే నేను రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను’ అని ఆమె తెలిపారు.

Related Articles

Most Read