17 ఏళ్ల తర్వాత విశ్వ సుందరిగా భారత వనిత

Posted 3 months ago | Category : world

అంతర్జాతీయ వేదికపై భారతీయ అందం మరోసారి మెరిసింది.

భారతీయ యువతి మానుషీ చిల్లార్.. ‘మిస్ వరల్డ్ 2017’గా ఎంపికైంది. 17 ఏళ్లుగా భారత్‌కు దక్కకుండా ఊరిస్తున్న ఈ టైటిల్‌ను సగర్వంగా చేజిక్కించుకొని భారత్ సత్తా చాటింది. ఇండియా నుంచి మిస్ వరల్డ్ టైటిల్‌కు ఎంపికైన ఆరో మహిళ మానుషి కావడం విశేషం.

2000 సంవత్సరంలో టైటిల్ దక్కించుకున్న ప్రియాంక చోప్రా తర్వాత ఇప్పుడు ‘మిస్ వరల్డ్’ టైటిల్‌కు ఎంపికైన భారతీయ వనిత మానుషియే కావడం గమనార్హం. 108 మందితో తీవ్రమైన పోటీ ఎదుర్కొన్న మానుషి.. తుదిపోరులో సత్తా చాటి విజేతగా నిలిచింది. శనివారం (నవంబర్ 18) చైనాలోని సన్యా నగరంలో జరిగిన తుది పోటీల్లో విజేతగా నిలిచిన మానుషికి మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించారు.

67వ మిస్ వరల్డ్ పోటీల్లో మొదటి రన్నరప్‌గా మెక్సికోకి చెందిన ఆండ్రియా మేజా నిలవగా.. రెండో రన్నరప్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన స్టీఫెనీ హిల్‌ నిలిచింది. అందరినీ వెనక్కినెట్టి విజేతగా నిలిచిన మానుషి చిల్లార్‌కు మిస్ వరల్డ్-2016 విన్నర్ స్టెఫానే డెల్‌వాలే కిరీటాన్ని అలంకరించింది.

హర్యానా రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల మానుషి.. భారత్ నుంచి 29 మందితో పోటీ పడి మిస్ వరల్డ్ పోటీలకు ఎంపికైంది. ప్రస్తుతం ఈమె ఎంబీబీఎస్ చదువుతోంది. ‘బ్రెయిన్ విత్ బ్యూటీ’గా పేరు గడించిన ఈ యువతి.. ఈ ఏడాది ప్రథమార్థంలో ‘మిస్ ఇండియా-2017’గా ఎంపికైంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఇప్పటికే చాలా అవార్డులు దక్కించుకున్న మానుషి.. భారత్ మరోసారి తలెత్తుకునేలా చేసింది.

ప్రపంచ సుందరీ పోటీల్లో తన మాటలు, చేతల ద్వారా ఆద్యంతం ఎంతో పరిణతి ప్రదర్శించిన మానుషి.. టైటిల్ సాధించిన అనంతరం కూడా అదే రీతిలో స్పందించింది. ‘మిస్ వరల్డ్‌గా ఎంపికవడం నా చిన్ననాటి కల. విజేతగా ఎంపికవడం అనేది ఒక ప్రయాణం లాంటిది. దాన్ని నేనెప్పుడు మరచిపోను. ఈ ప్రయాణంలో నేనెంతో నేర్చుకున్నా.. ఎంతో ఆనందాన్ని ఆస్వాదించా.. ఫలితాన్ని మాత్రం విధికే వదిలేశా’ అని ఆమె పేర్కొంది.


6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 10 hours ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 12 hours ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 13 hours ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted a day ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 2 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 3 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 7 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 7 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 7 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!

Posted 8 days ago | Category : world

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!