ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

కోలుకొని తయారీ రంగం .... కొత్త కొలువులు ఉండబోవు

Posted 5 months ago business

నోట్లరద్దుతో కుదేలు పడిన తయారీ రంగం ఇంకా కోలుకోలేదు. దానితో ఈ ఏడాది కొత్త కొలువులు ఉండబోవని స్పష్టం చేశాయి. 73 శాతం సంస్థలు కొత్త వాళ్లని తీసుకునేందుకు అనాసక్తి చూపించినట్లు  త్రైమాసిక సర్వేలో ఫిక్కీ వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇంకా మిగిలిన మూడు నెలల్లో ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటే తప్ప కొత్త ఉద్యోగాలు కల్పించలేమని పలు సంస్థలు అభిప్రాయపడ్డాయి. కొత్త వాళ్లను తీసుకుంటే మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతుందని సంస్థలు పేర్కొన్నాయి.

నోట్లరద్దు వల్ల 15 లక్షల ఉద్యోగాలు పోయాయంటూ వచ్చిన వార్తలు నిజమేనని ఈ సర్వేలో స్పష్టమైంది. రానున్న రోజుల్లో ఇంకొన్ని ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడిందని పలు సంస్థలు తెలిపాయి.  గత సర్వేలో 77 శాతం కంపెనీలు అనాసక్తి చూపడం విశేషం. అయితే 49 శాతం సంస్థలు మాత్రం రానున్న మూడు నెలల్లో పరిస్థితులు చక్కబడే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. సిమెంట్‌, సిరామిక్స్‌, రసాయన, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌, వాహన రంగాలతో సహా మొత్తంగా 11 ముఖ్య రంగాల్లో ఫిక్కీ సర్వే నిర్వహించింది. 300కిపైగా సంస్థలను ప్రశ్నించింది.

వీటి మొత్తం నికర ఉత్పత్తి విలువ రూ. 3.5 లక్షల కోట్లు అని ఫిక్కీ వెల్లడించింది. గతేడాదిలానే ఈ ఏడాది కూడా ఆర్డర్లు ఎక్కువగానే వచ్చాయని పలు కంపెనీలు తెలిపినప్పటికీ ఉత్పత్తి రేటు ఈ ఏడాది భారీగా పెరగడంతో ఆందోళన చెందుతున్నట్లు 69 శాతం కంపెనీలు స్పష్టం చేశాయి. వృద్ధి రేటు కూడా గత సర్వేతో పోలిస్తే 10 శాతం పడిపోవడం విశేషం. గత సర్వేలో వృద్ధి రేటు 27 శాతం ఉండగా..ఈ ఏడాది అది 17 శాతానికే పరిమితమైంది.

పెట్టుబడులు కూడా ఆశాజనకంగా లేకపోవడం మరింత ఆందోళన చెందాల్సిన అంశం. రానున్న ఆరు నెలల్లో కొత్త ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించడంగానీ, ఉత్పత్తి రేటును పెంచే యోచనగానీ లేదని 75 శాతం కంపెనీలు స్పష్టం చేయడంతో పరిస్థితి తీవ్రత అర్థమౌతోంది. దీనికి తోడు విదేశీ దిగుమతులు పెరగడం, కొన్ని కారణాల వల్ల పూర్తి స్థాయిలో ప్లాంట్లు నిర్వహించకలేకపోవడం, స్థానికంగా తక్కువ డిమాండ్‌ వంటివి కూడా ప్రతికూలాంశాలని ఫిక్కీ వివరించింది. అయితే ఎగుమతులు స్థిరంగా కొనసాగడం కాస్త సానుకూలాంశమని పేర్కొంది.

Related Articles

Most Read