గంటన్నర గుండె ఆగిపోయింది అయినా.

Posted 8 months ago | Category : world

హమ్మా...బాబోయి చచ్చి బతికాను అంటారు కొందరు, మరికొందరు మరణం అంచువరకు వెళ్లి వచ్చామని అంటూఉంటుంటారు. అలాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా వచ్చిందా...? కానీ ఇలాంటి ఘటనే అమెరికాలోని బాల్టిమోర్‌లో సంభవించింది. ప్రమాదవశాత్తు 20 అడుగుల ఎత్తైన గోడ మీద నుంచి కిందపడిపోయిన ఓ 32 ఏళ్ల వ్యక్తి 90 నిమిషాల పాటు మరణించాడు. కానీ ఆయన మళ్లీ ప్రాణం పోసుకుని రెండు వారాల తర్వాత లేచి కూర్చున్నాడు. 2016 మార్చిలో గోడపై నుంచి కిందపడిన ఇంజినీర్ టీజే స్కాన్లాన్‌ను ఎవరూ గుర్తించకపోవడంతో రెండు రోజులపాటు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

ఆ తర్వాత అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో స్కాన్లాన్ చాతీ కింద భాగం చచ్చుబడిపోవడంతో కాళ్లు పనిచేయడం మానేశాయి. అంతేకాదు ఆస్పత్రికి తరలించే సమయంలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా గుండె ఆగిపోయింది. దాదాపు గంటన్నరపాటు గుండె పనిచేయలేదు. ప్రమాదంలో అతడి వెన్నెముక విరిగిపోయింది. కిడ్నీలు, ఊపిరితిత్తులు పనిచేయడం మానేశాయి. రెండు రోజులపాటు రక్తపు మడుగులో పడి ఉండడంతో అతడి అవయవాలు నీలం రంగులోకి మారిపోయాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయింది. సాంకేతికంగా స్కాన్లాన్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. కేవలం ఐదు శాతం మాత్రమే బతికే అవకాశం ఉండగా వైద్యుల కృషితో రెండు వారాల తర్వాత కళ్లు తెరిచి పునర్జన్మ పొందాడు.

ఏడాది పాటు రిహాబిలిటేషన్ చికిత్స తీసుకుని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. ఏడాది కిందట కొలంబియాలోని స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హజరైన తిరిగి వచ్చిన స్కాన్లాన్ ఇంటి తాళం తీస్తుండగా ప్రమాదవశాత్తు తూలి కింద పడిపోయాడు. 20 అడుగుల ఎత్తు నుంచి కాంక్రీట్ ఉపరితలంపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజులపాటు ఎవరూ చూడకపోవడంతో చివరికి అతడి స్నేహితుడు గుర్తించి హాస్పిటల్‌కు తరలించాడు. హాస్పిటల్‌కు తరలిస్తుండగా ఆయన గుండె ఆగిపోయింది. సుమారు గంటన్నరపాటు గుండె కొట్టుకోకపోవడంతో ఈసీఎం ద్వారా చికిత్స అందించారు.29 శస్త్రచికిత్సలు అనంతరం రెండు వారాల తర్వాత స్పృహలోకి వచ్చాడు. తొమ్మిది వారాలపాటు హాస్పిటల్‌లో ఉన్న స్కాన్లాన్‌కు ఏడాదిపాటు ఫిజియోథెరపీ చేశారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!