ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

'మహానటి' .. విడుదల తేదీ ఖరారు..!

Posted 5 days ago movies

మంచి మనిషి .. మహానటి అని సావిత్రి గురించి చిత్రపరిశ్రమలో చెప్పుకుంటారు. ఆమెకి కల్లాకపటం తెలియదని సన్నిహితులు అంటారు. దానధర్మాలు చేయడంలో ఆమె తరువాతనే ఎవరైనా అని చెబుతారు. అలాంటి సావిత్రి .. వైవాహిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఆ బాధను మరిచిపోవడానికి మద్యానికి బానిసై అనారోగ్యాన్ని కొనితెచ్చుకుని తనువు చాలించింది సావిత్రి.

ఆమె జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. సావిత్రిగా కీర్తి సురేశ్ నటిస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మాయాబజార్ సినిమాలోని ఓ బొమ్మల పెట్టెతో ప్రారంభమైన ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో 'అది ప్రియదర్శిని వదినా.. ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వాళ్లకు కనిపిస్తుంది అంటూ మొదలై మీకు పెళ్లయిందా..? అయితే నన్ను చేసుకుంటారా..?, నన్ను వదిలి నీవు పోలేవులే.. అది నిజములే' అంటూ సావిత్రి సినిమాల్లోని డైలాగులు, పాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్‌లో అదరగొడుతున్న మ్యూజిక్ ప్లే అవుతుండగా ఓ మహిళ ఆ పెట్టెను తెరవగానే అందులోంచి 'మహానటి' టైటిల్ బయటకు రావడం తెగ ఆకట్టుకుంటోంది. వీడియో చివరలో మార్చి 29న సినిమాను విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది యూనిట్.

మహానటి సావిత్రి గా కీర్తిసురేష్, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా సావిత్రి జయంతి సందర్బంగా 'మహానటి' టైటిల్ లోగోను విడుదల చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసేసింది చిత్రయూనిట్. టైటిల్ లోగోతో కూడిన ఓ ప్రత్యేక వీడియోను బయటకు వదిలింది యూనిట్.

Related Articles

Most Read