ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఐదు నక్షత్రాల హోటళ్లను వదిలేయండి

Posted 4 months ago politics

ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం కేంద్ర మంత్రులు ఫైవ్ స్టార్ హోటళ్ళలో బస చేస్తుండటంపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫైవ్ స్టార్ హోటళ్ళలో బస చేయడం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రయోజనాలను పొందడం నుంచి దూరంగా ఉండాలని కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరినట్లు సమాచారం.

అధికారిక విధుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో కొందరు మంత్రులు ప్రభుత్వం ఏర్పాటు చేసే వసతుల్లో ఉండకుండా విలాసవంతమైన సౌకర్యాల కోసం ఐదు నక్షత్రాల హోటళ్లకు వెళ్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి విలాసాలకు ప్రభుత్వ నిధులను ఖర్చు పెడుతుండటంపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయొద్దని ఆయన మంత్రులకు సూచించారుకొందరు మంత్రులు తమ పరిథిలోని ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలను స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పినట్లు సమాచారం. ఇటువంటి వ్యవహారాలను తాను సహించబోనని స్పష్టం చేశారని తెలుస్తోంది. శూన్య స్థాయిలోనైనా అవినీతిని సహించేది లేదన్న సిద్ధాంతంతో రాజీపడబోనని చెప్పినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాహనాలను కుటుంబసభ్యుల కోసం ఉపయోగించొద్దని ఆయన మంత్రులకు చెప్పారు. అలా చేస్తే సహించబోయేది లేదని హెచ్చరించారు. అవినీతికి పాల్పడుతూ కుంభకోణాల్లో ఇరుక్కుంటే సహించేది లేదని మంత్రులకు ప్రధాని తేల్చి చెప్పారు. 2019 ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే ఉన్నందున అవినీతి రహిత ప్రభుత్వంగా ప్రజలు ఆదరించేలా నడుచుకోవాలని మంత్రులకు సూచించారు.

Related Articles

Most Read